తమన్నా నిజమైన క్రష్ ఎవరిపై అంటే?
ప్రస్తుతం అతడితో కలిసి ఓ సినిమాలో నటించిన తమన్నా ప్రచార కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా మొదటి క్రష్ ఎవరిపై? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువేమీ కాదు. ఇటీవలి క్రష్ మాత్రం నటుడు విజయ్ వర్మ. కానీ అతడి కంటే ముందే ఒక ప్రముఖ నటుడిపై తమన్నా భాటియాకు క్రష్ ఉంది. ఆ నటుడు మరెవరో కాదు.. జిమ్మీ షేర్గిల్. 'మొహబ్బతీన్'లో జిమ్మీ షెర్గిల్‌ను చూసిన తర్వాత తమన్నా భాటియాకు తనపై క్రష్ ఏర్పడిందట. ప్రస్తుతం అతడితో కలిసి ఓ సినిమాలో నటించిన తమన్నా ప్రచార కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
తమన్నా భాటియా- జిమ్మీ షెర్గిల్- అవినాష్ తివారీ ప్రధాన పాత్రధారులుగా నటించిన `సికందర్ కా ముఖద్దర్` ఓటీటీలో స్ట్రీమింగుకి వస్తోంది. తాజా చాటింగ్ సెషన్‌లో ఈ ముగ్గురూ తమ హీస్ట్ థ్రిల్లర్ గురించి ముచ్చటించారు. మొహబ్బతీన్‌లో జిమ్మీని చూశాక తాను ఆకర్షితురాలయ్యానని క్రష్ మూవ్ మెంట్ ఉందని తమన్నా అన్నారు. అయితే సెట్లో మొదటిసారి తనను కలుసుకున్నప్పుడు సీనియర్ నటుడు జిమ్మీని చూసి భయపడ్డానని తెలిపింది. సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను తమన్నా ముచ్చటించింది. .
నిజానికి తన కాలేజ్ డేస్‌లో మహిళా ఉపాధ్యాయులు జిమ్మీపై క్రష్ తో ఉన్నారని, దానికి తాను ఆశ్చర్యపోలేదని కూడా తమన్నా వెల్లడించింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జిమ్మీ షెర్గిల్ తో ప్రేమలో పడతారని కూడా తమన్నా అంది. మొహబతీన్ లో చూశాక తాను జిమ్మీని ప్రేమించానని కూడా తమన్నా అంగీకరించింది. అతడు
అరుదైన ప్రతిభావంతుడు అని కూడా జిమ్మీని పొగిడేసింది తమన్నా. కెరీర్ లో క్వాంటిటీ కంటంట్ ఉన్న సినిమాల్లో జిమ్మీ నటించారని, అతడు నటించే సినిమాల కోసం తాను చాలా ఎదురు చూసానని తమన్నా అంది. సికందర్ కా ముఖద్దర్‌లో నటించే ముందు తాను ఎప్పుడూ జిమ్మీని కలవలేదని తమన్నా అంది.
సెట్లో కలుసుకున్నప్పుడు అతడు పోలీస్ వేషంలో ఉన్నాడు. నాకు హలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయితే జిమ్మీ మాత్రం వెంటనే `హలో` చెప్పాడట. సెట్‌లో కలిసిన మొదటి రోజునే తనకు తానుగా జిమ్మీ పరిచయం చేసుకున్నాడని వెల్లడించింది. ఓటీటీ చిత్రం సికందర్ కా ముఖద్దర్ కి నీరజ్ పాండే దర్శకత్వం వహించించారు. నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే దీనికి మిశ్రమ స్పందనలు వచ్చినా నీరజ్ ఫ్యాక్టర్ ప్లస్ అయింది.