గేమ్ చేంజర్.. ఫ్యాన్స్ ఊగిపోయే ట్రీట్..!

ఓ పక్క ఇండియన్ 2 సినిమా చేస్తూనే మరోపక్క గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు శంకర్.

Update: 2024-06-08 04:01 GMT

ఆచార్య తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నాడు గ్లోబల్ స్టార్ రాం చరణ్. RRR లో సీతారామరాజు పాత్రతో గ్లోబల్ వైజ్ తన మాస్ స్టామినా చూపించిన చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరోసారి తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు. శంకర్ కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని టాక్. ఓ పక్క ఇండియన్ 2 సినిమా చేస్తూనే మరోపక్క గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు శంకర్.

గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కి జతగా బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది కియారా. ఈ సినిమాతో ఈ కాంబో రిపీట్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ సాంగ్ కోసం ఒక క్రేజీ హీరోయిన్ ని తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయట.

స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే హీరోయిన్స్ కూడా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సినిమాలో ఆ సాంగ్ స్పెషల్ అటెన్షన్ ని ఏర్పరచుకుంటుందని హీరోయిన్స్ గట్టి నమ్మకం. శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే దాని రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ సాంగ్ లో ఎవరు నటించినా సరే మెగా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ పక్కా అనేస్తున్నారు మేకర్స్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో అన్ని సాంగ్స్ ఒకెత్తు ఐతే ఈ స్పెషల్ సాంగ్ ఒకెత్తు అనేలా కంపోజ్ చేస్తున్నారట.

గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ కూడా మరోసారి గ్లోబల్ స్టార్ స్టామినా ఏంటో ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుందని అంటున్నారు. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ గేమ్ చేంజర్ ని దసరా రేసులో దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 10న ఆల్రెడీ ఎన్.టి.ఆర్ దేవర వస్తున్నాడు. ఆ సినిమా ప్రీ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అందుకే దేవర ప్లేస్ లో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉందట. మరి అఫీషియల్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మేకర్స్ ప్రకటిస్తేనే కానీ తెలుస్తుంది.

Tags:    

Similar News