టాలీవుడ్ లో ఆ భామలదే హవా!
ఒకప్పుడు తెలుగు సినిమా హీరోయిన్లు అంటే? ఎక్కువగా నార్త్ భామలే ఎక్కువగా కనిపించేవారు. అందులోనూ ముంబై నుంచి దిగుమతి అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.
ఒకప్పుడు తెలుగు సినిమా హీరోయిన్లు అంటే? ఎక్కువగా నార్త్ భామలే ఎక్కువగా కనిపించేవారు. అందులోనూ ముంబై నుంచి దిగుమతి అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. మోడలింగ్ నుంచి నటులుగా ప్రమోట్ అయిన వారంతా టాలీవుడ్ లో కనిపించేవారు. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్...కోలీవుడ్ పరిశ్రమలో అతి పెద్దవి. దీంతో వాళ్లకు ఈ రెండు పరిశ్రమలు మంచి అవకాశాలు కల్పించేవి. దర్శక-నిర్మాతలు కూడా వాళ్లకు ఇచ్చినంత ప్రాధన్యత ఇతర భాషల నాయికలకు వచ్చే వారు కాదు.
ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ అయిన చాలా భామల ట్రాక్ చెక్ చేస్తే టాలీవుడ్ లో వెలిగిన భామల పేర్లు చాలా కనిపిస్తాయి. వీళ్లకు పోటీగా కేరళ, బెంగుళూరు భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేవారు. కానీ వాళ్ల నుంచి పోటీని మాత్రం చాలా విషయాల్లో తట్టుకో లేకపోయేవారు. అలా సౌత్ భామలు నార్త్ భామల తో వెనుక బడేవారు. అయితే దశాబ్ధ కాలంగా ఈ ట్రెండ్ మారింది. నార్త్ భామలకు బధులుగా సౌత్ భామలకు పెద్ద పీట వేయడం మొదలైంది.
కాల క్రమంలో వాళ్లలో నిజమైన ప్రతిభావంతుల్ని వెలికి తీయడంపై మరింత దృష్టి పెట్టి పనిచేయం ఎక్కువైంది. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లగా రాణిస్తున్న వారంతా మాలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి వచ్చిన వాళ్ల జాబితానే ఎక్కువగా ఉంటుంది. కీర్తి సురేష్, అనుపమ పరమశ్వరన్, సంయుక్తా మీనన్ ప్రియాంక అరుల్ మోహన్, శ్రద్దా శ్రీనాధ్, సాయి పల్లవి, నయనతార, సమంత వీళ్లంతా సౌత్ భామలే. సౌత్ భామల ఎంట్రీ తో సినిమా చాలా రకాలుగా కలిసొచ్చింది.
వీళ్లంతా నేచురల్ పెర్పార్మెర్లు. నేచురల్ బ్యూటీలు. ప్రతీ సందర్భంలోనూ మ్యాకప్ లు అవసరం లేదు. రియలిస్టిక్ ముఖాలతో కెమెరా ముందుకొచ్చిన భామలు చాలా మంది ఉన్నారు. హీరోలకు పోటీగా డాన్సులు, నటన చేయ గలరు. ఇది దర్శకులకు బొలెడంత సమయాన్ని వృద్ధా చేస్తుంది. నార్త్ భామలతో పోల్చితే ఈ విషయంలో దర్శకు లకు ఎంతో కంపర్ట్ కుదురుతుంది. అయితే గతంలో గ్లామర్ పాత్రలకు సౌత్ భామలు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడా భామల మధ్యనే తీవ్రమైన పోటీ ఉండటంతో? అందులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరికొకరు పోడీ పడి ముందుకొస్తున్నారు.