వాళ్ల‌కి తొలి రోజు సెంచ‌రీ క‌ష్ట‌మేనా?

పుల్ ర‌న్ లో ఈ సినిమాలు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయి.

Update: 2024-03-11 12:30 GMT

2023 బాలీవుడ్ నామ సంవ‌త్స‌ర‌మైన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ సినిమాలు వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి బ్లాక్ బ‌స్టర్ అవ్వ‌డంతో తిరుగులేని సంవ‌త్స‌రంగా మిగిలిపోయింది .'జవాన్'..' పఠాన్'.. 'యానిమల్' లాంటి సినిమాలు తొలిరోజు 100 కోట్ల వ‌సూళ్ల‌తో సునామీ సృష్టించ‌డంతోనే సాధ్య‌మైంది. 'గదర్ 2' సైతం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పుల్ ర‌న్ లో ఈ సినిమాలు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయి. అదే ఉత్సాహంతో బాలీవుడ్ 2024 లోకి అడుగు పెట్టింది.

ఈ ఏడాది కూడా ఇండియాని షేక్ చేసే ఇండ‌స్ట్రీ మ‌న‌దే అవుతుంది ? అన్న ధీమాతో స‌ద‌రు ప‌రిశ్ర‌మ క‌నిపిస్తుంది. పోటీగా టాలీవుడ్ నుంచి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న‌ప్ప‌టికీ అంతిమంగా ఫ‌లితం మాదే అవుతుంది అన్న ధీమాతో ఉన్నారు. అయితే ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్ ..బాలీవుడ్ కి గ‌ట్టిషాక్ త‌గిలింది. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన తెలుగు సినిమాలేవి భారీ స్థాయిలో వ‌సూళ్లు సాధించ‌లేదు. అన్ని సినిమాలు అగ్ర హీరోల‌వే అయినా ఊపేసే వ‌సూళ్లు ఏ సినిమాకి రాలేద‌న్న‌ది తెలిసిందే.

ఇక బాలీవుడ్ ప‌రిస్థితి అయితే అంత‌కు దారుణంగానే క‌నిపిస్తుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన హృతిక్ రోష‌న్ 'ఫైట‌ర్' తొలిరోజు 100 కోట్లు వ‌సూళ్లు ఓపెనింగ్స్ తోనే సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేసినా ప‌న‌వ్వ‌లేదు. సినిమా డిజాస్ట‌ర్ గా తేల‌డంతో రెండ‌వ రోజుతోనే థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయి. ఇక ఇదే స్థాయి అంచ‌నాల‌తో అక్ష‌య్ కుమార్-టైగ‌ర్ ష్రాప్ న‌టిస్తోన్న 'బడే మియాన్ చోటే మియాన్' ఈద్ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా కూడా తొలి రోజు సెంచ‌రీ కొట్ట‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది.

ఎందుకంటే ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలేవి సినిమాపై ఏమంత పాజిటిబ్ బ‌జ్ తీసుకురా లేదు. పాటలు.. టీజర్‌లు క్ పై అంతా పెద‌వి విరిచేస్తోన్న స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఈ సినిమాతో తొలిరోజు 50 కోట్లు గ్రాస్ తేవ‌డం కూడా క‌ష్ట‌మ‌నే అంటున్నారు. ఇద్ద‌రు స్టార్లు ఉన్నా? అతిక‌ష్ట‌మైన ప‌నే అన్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. అలాగే హిట్ ప్రాంచైజీ నుంచి రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్' ఏప్రిల్ 15న రిలీజ్ అవుతుంది. ఇందులో భారీ తాగాగ‌ణ‌మే ఉంది. ప్రాజెక్ట్ లో సూప‌ర్ స్టార్లు..హీరోయిన్లు భాగ‌మ‌య్యారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. కానీ అదే రోజున ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ ప్రాజెక్ట్ గా 'పుష్ప‌-2' కూడా రిలీజ్ అవుతుంది. దీంతో రెండు సినిమాల మ‌ధ్య క్లాష్ ఏర్ప‌డు తుంది. దీని కార‌ణంగా 'సింగం ఎగైన్' తొలి రోజు సెంచ‌రీ కొట్ట‌డం క‌ష్ట‌మ‌నే టాక్ వినిపిస్తుంది. ఆ త‌ర్వాత హిందీ నుంచి ఇదే ఏడాది రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేవి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అదే జ‌రిగితే బాలీవుడ్ కి 2024 లో ఒక్క 100 కోట్ల వ‌సూళ్లు సినిమా కూడా లేన‌ట్లే అవుతుంది.

Tags:    

Similar News