దిల్ రాజు బిగ్ ఎనౌన్స్‌మెంట్.. గెట్ రెడీ!
మొదటిది.. దిల్ రాజు మార్కో డైరెక్టర్ హనీఫ్‌తో ప్లాన్ చేస్తున్న కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇదేనన్నది.;

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు మరోసారి సినీప్రపంచాన్ని షేక్ చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి చిత్రాలపై దృష్టి పెట్టిన ఈ స్టార్ ప్రొడ్యూసర్, తన బ్యానర్ నుంచి వస్తున్న కొత్త అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఏప్రిల్ 16 ఉదయం 11:08 గంటలకు 'దిల్ రాజు బిగ్ ఎనౌన్స్‌మెంట్' ఉండబోతుందని పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇది ఏ సినిమా అనేది స్పష్టంగా తెలియకపోయినా... పక్కాగా ఇది ఓ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ అన్నది మాత్రం పక్కా. పోస్టర్ డిజైన్ చూడగానే, ఇది ఏదో సాంకేతికత ఆధారంగా ఉండే కథా చిత్రమేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్ డిజైన్‌లో మనిషి ముఖాన్ని AI సర్క్యూట్ డిజైన్‌గా చూపించడం విశేషంగా నిలిచింది. దాంతో, ఇది ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా అనేదే మరింత బలపడుతోంది.
ఇక ప్రధానంగా ఈ పోస్టర్ నేపథ్యంలో రెండు గాసిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మొదటిది.. దిల్ రాజు మార్కో డైరెక్టర్ హనీఫ్‌తో ప్లాన్ చేస్తున్న కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇదేనన్నది. ఇప్పటికే హనీఫ్ పలు సినిమాలతో రైటర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించబోయే మరో భారీ ప్రాజెక్ట్ ఇది కావచ్చని టాక్. అందులో ఇద్దరు హీరోలు ఉంటారని టాక్.
మరోవైపు, గత కొన్ని రోజులుగా వంశీ పైడిపల్లి ఆమిర్ ఖాన్ కాంబోపై జరుగుతున్న చర్చలు కూడా ఇందులో కీలకంగా మారే అవకాశముంది. వంశీ పైడిపల్లి, హిట్స్ ఉన్నా పాన్ ఇండియా రేంజ్‌లో తన మార్క్ చూపలేకపోయాడు. కానీ ఆమిర్ ఖాన్‌తో చేయబోయే ప్రాజెక్ట్ ద్వారా అతడి కెరీర్ మళ్లీ దూసుకెళ్లే అవకాశం ఉంది.
దిల్ రాజు, బాలీవుడ్ బిజినెస్‌ను టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో, ఇది కూడా బిగ్ ఎనౌన్స్‌మెంట్ కావచ్చన్న ఊహాగానం వినిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్ ద్వారా దిల్ రాజు ఇండస్ట్రీకి బిగ్ ప్రొడ్యూసర్ అనే సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మిస్టరీ ప్రాజెక్ట్ ఏదన్నది ఏప్రిల్ 16 ఉదయం తెలిసిపోతుంది. మరి ఆ సినిమా అప్డేట్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.