గేమ్ చేంజర్… బెన్ ఫిట్ షోలపై దిల్ రాజు క్లారిటీ

ఈ విషయాన్ని మీడియాతో దిల్ రాజు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న యూఎస్ లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

Update: 2024-12-19 12:50 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సినిమా ప్రమోషన్స్ తో మరో లెవెల్ లో బజ్ క్రియేట్ చేయబోతోంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి దేశ వ్యాప్తంగాగా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 'పుష్ప 2' తరహాలోనే మెగా ఈవెంట్స్ ని నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈవెంట్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారు. దిల్ రాజు అయితే ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

గేమ్ ఛేంజర్ చిత్రంపై దాదాపు 250 కోట్లపైన పెట్టుబడి పెట్టారని టాక్. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ సినిమాపై ఎంతో కొంత హైప్ క్రియేట్ కావడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. కానీ ఆయన నుంచి చివరిగా వచ్చిన 'ఇండియన్ 2' ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇదే మెగా ఫ్యాన్స్ ని భయపెడుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన టీజర్, సాంగ్స్ కొంత వరకు నమ్మకం పెంచాయి.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మూవీపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంటర్వ్యూలలో కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా రాబోతున్న 'గేమ్ చేంజర్' కి రెండు తెలుగు రాష్ట్రాలలో బెన్ ఫిట్ షోలు ఉండబోతున్నాయంట. ఈ విషయాన్ని మీడియాతో దిల్ రాజు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న యూఎస్ లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

ఈ ఈవెంట్ కి సినిమాకి వర్క్ చేసిన క్యాస్టింగ్ అండ్ క్రూ మొత్తం వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు సినిమాలోని ఫోర్త్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' మూవీ బెన్ ఫిట్ షోలు ఉండబోతున్నాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 'పుష్ప 2' మూవీకి బెన్ ఫిట్ షోల ద్వారా భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన కాస్తా ఇబ్బందికరంగా మారింది.

ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేశారు. దీంతో నెక్స్ట్ స్టార్ హీరోల సినిమాలకి బెన్ ఫిట్ షోలు నిర్వహించకపోవచ్చనే ప్రచారం జరిగింది. అయితే పక్కా ప్లానింగ్ తో బెన్ ఫిట్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పారు. మరి ఈ సినిమా బెన్ ఫిట్ షోలకి టికెట్ ధరలు ఎంత నిర్ణయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News