దిల్ రాజు న్యూ రూట్.. గేమ్ ఛేంజర్ కోసం తప్పట్లేదు..

దీనికోసం మూవీ టీమ్ మొత్తం యూఎస్ వెళ్లబోతోంది. ఈ ఈవెంట్ కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-12-17 15:30 GMT

టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకి ఒక ఎక్స్ పెక్టేషన్స్ ఉంటుంది. కచ్చితంగా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలే దిల్ రాజు చేస్తారనే పేరుంది. అలాగే దిల్ రాజు కూడా ప్రమోషన్స్ కోసం అనవసరమైన ఖర్చు చేయకుండా తన బ్రాండ్ ఇమేజ్ నే ఉపయోగిస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అతని నుంచి వచ్చే సినిమాలని బాగానే ఆదరిస్తారు. అయితే గత కొంతకాలంలో దిల్ రాజు మెయిన్ ప్రొడక్షన్ నుంచి సరైన సక్సెస్ లు రాలేదు.

ఈ సంక్రాంతికి అతని నుంచి రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 'గేమ్ చేంజర్' మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దిల్ రాజు 200+ కోట్లకి పైగా పెట్టుబడి పెట్టారు. సినిమాపైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తనకి సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నారు.

అయితే గతంలో సినిమా ప్రమోషన్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టని దిల్ రాజు 'గేమ్ చేంజర్' విషయంలో మాత్రం కాస్తా రూట్ మార్చారు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకోవాలంటే నేషనల్ వైడ్ గా క్రేజ్ కావాలి. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి ఈ సినిమా కంటెంట్ ని బలంగా తీసుకొని వెళ్ళాలి. అందుకే ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు ఆలోచన మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో నిర్వహించబోతున్నారు.

దీనికోసం మూవీ టీమ్ మొత్తం యూఎస్ వెళ్లబోతోంది. ఈ ఈవెంట్ కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఇండియాలో ఐదు ప్రధాన పట్టణాలలో మెగా ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారంట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఐదు ఈవెంట్స్ లో పాల్గొని సినిమాని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళబోతున్నారు. జనవరి మొదటి వారం నుంచి వరుసగా ఈ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో గ్రాండ్ గా మూవీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఎన్నడూ లేని స్థాయిలో 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ కోసం దిల్ రాజు ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'పుష్ప 2'కి మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఈ రోజు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటే నేషనల్ వైడ్ గా నిర్వహించిన ఈవెంట్స్ కూడా ఒక కారణం అనే ప్రచారం నడుస్తోంది. అందుకే 'గేమ్ చేంజర్' విషయంలో కూడా 'పుష్ప 2' ఫార్ములాని దిల్ రాజు వాడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News