రౌడీ జనార్థనగా రానున్న విజయ్ దేవరకొండ!
Dil Raju Leaks VD’s New Title, Explains Piracy Issue;
విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. విజయ్ సాలిడ్ హిట్ అందుకుని ఎన్నో ఏళ్లవుతుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో కింగ్‌డమ్ సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది.
భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఎంతో గొప్పగా చెప్తున్నాడు. మే 30న కింగ్‌డమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటూ విజయ్ పలు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
అందులో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి. దిల్ రాజు, విజయ్ కలిసి చేసిన ది ఫ్యామిలీ స్టార్ ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో విజయ్ హీరోగా దిల్ రాజు మరో సినిమాను గతేడాదే అనౌన్స్ చేశాడు. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను నిర్మాత దిల్ రాజు లీక్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ప్రెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు విజయ్ సినిమా టైటిల్ ను చెప్పేశాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి సినిమాకు రౌడీ జనార్థన అనేది టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నరట. దీంతో పాటూ విజయ్ రాహుల్ సాంకృత్స్యన్ తో కూడా సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. రాహుల్ సినిమా కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లి సమాంతరంగా షూటింగ్ జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.