గాయకులు ఈజీ టార్గెట్.. పాపులర్ గాయకుడి ఆవేదన!
ఆల్కహాల్, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే పదాలను తమ పాటల్లో ఉపయోగించకూడదని దిల్జీత్ దోసాంజ్ ని ప్రభుత్వం హెచ్చరించిన సంగతి విధితమే
By: Tupaki Desk | 23 Nov 2024 4:40 PM GMTఆల్కహాల్, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే పదాలను తమ పాటల్లో ఉపయోగించకూడదని దిల్జీత్ దోసాంజ్ ని ప్రభుత్వం హెచ్చరించిన సంగతి విధితమే. భారతదేశంలో ప్రస్తుతం దిల్-లుమినాటి టూర్‌లో బిజీగా ఉన్నాడు దిల్జీత్. నవంబర్ 22న లక్నోలో దిల్జీత్ ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చాడు. ఈ సమయంలో అతడు తన పాటలకు సంబంధించి వివాదాల గురించి ప్రస్తావించాడు. కొన్ని రోజులుగా తన పాటలలో మద్యపానం, తుపాకీ హింసను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గాయకుడు తన ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాటల సెన్సార్ షిప్, సినిమాలకు సెన్సార్‌షిప్ నియమాలలో చాలా వ్యత్యాసం ఉందని, ఈ పద్ధతులను అనుసరించాలని డిమాండ్ చేశాడు. చాలా మంది పెద్ద నటులు మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలలో కనిపించారని, అయితే వాటిని ఎవరూ ప్రశ్నించలేదని అన్నారు. గాయకులు మాత్రమే ఎప్పుడూ `సాఫ్ట్ టార్గెట్స్` అని కూడా అతను పేర్కొన్నాడు. నవంబర్ 22 న దిల్జిత్ తన ఇన్‌స్టాఖాతాలో లక్నో కచేరీలో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పాటలలో అతిగా మద్యం, హింసను ప్రశ్నించిన మీడియా సిబ్బందిపై అతడు ఫైర్ అయ్యాడు. నిజానికి ఆ పదాల ప్రస్తావన లేకుండా హిట్ ఇవ్వమని సవాలు చేశాడు.
దిల్జిత్ దోసాంజ్ నటించిన సినిమాలు, పాటలలో సెన్సార్‌షిప్ చిక్కులపై గతంలోను అతడు పోరాటాలు చేసాడు. అదే సమయంలో మరొక సమస్యను కూడా ప్రస్తావించారు. తన పాటలు సెన్సార్ అయితే, భారతీయ సినిమా అంతటా అదే పద్ధతిని అమలు చేయాలని దిల్జిత్ వాదించారు.రెండవది నేను నా పాటలను సమర్థించడం లేదు. మీరు పాటలను సెన్సార్ చేయాలనుకుంటే భారతీయ సినిమాపై కూడా సెన్సార్ ఉండాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్కహాల్ సాంగ్ లేదా సీన్ చేయని పెద్ద నటుడు ఎవరో చెప్పాలని అన్నారు. కేవలం గాయకులు మాత్రమే సాఫ్ట్ టార్గెట్స్ అని ఆవేదన చెందారు.
నా చిత్రాలకు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వచ్చాయి. సంగీత కచేరీల సమయంలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే నిరాకరణను అమలు చేయడం చాలా సులభం. పాటల్లో మేము ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తే మాకు చెప్పండి అని కూడా అతడు అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.