సింగ‌ర్ కం న‌టుడు భార్య పిల్ల‌లు ఉన్నా కానీ..!

ఇప్పుడు త‌న‌ స్టార్ డ‌మ్ అనూహ్యంగా స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేయ‌డంతో ఇలాంటి విష‌యాల‌న్నీ మీడియాలో హైలైట్ గా మారుతున్నాయి.

Update: 2024-04-11 02:30 GMT

అవును.. అత‌డు పెళ్లి చేసుకున్నాడు. భార్య పిల్ల‌లు అమెరికాలో నివ‌శిస్తున్నారు. కానీ అత‌డు ప‌బ్లిక్ వేదిక‌ల‌పై త‌న కుటుంబం గురించి అన‌వ‌స‌రంగా ప్ర‌స్థావించ‌డు. అయితే అత‌డు ఎందుకిలా దాచేస్తున్నాడు? ఈ ప్ర‌శ్న‌కు చాలా సింపుల్ ఆన్స‌ర్ ఉంది. అత‌డు పూర్తిగా ప్ర‌యివేట్ వ్య‌క్తి. త‌న కుటుంబాన్ని పూర్తిగా ప్ర‌యివేట్ గా ఉంచాల‌నుకుంటాడు. అందుకే త‌న కుటుంబం గురించి అన‌వ‌స‌రంగా మీడియా ఎదుట ఫోక‌స్ చేయ‌డు. పైగా ఆమె అమెరికా నివాసి. ఇండో అమెరిక‌న్ కావ‌డంతో త‌ప్ప‌నిస‌రిగా అతడికి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు త‌న‌ స్టార్ డ‌మ్ అనూహ్యంగా స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేయ‌డంతో ఇలాంటి విష‌యాల‌న్నీ మీడియాలో హైలైట్ గా మారుతున్నాయి.


ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో సింగ‌ర్ కం న‌టుడు ఎవ‌రో తెలుసా? అత‌డు దిల్జీత్ దోసాంజ్. త‌న‌దైన అసాధార‌ణ ప్ర‌తిభ‌తో ఎంతో ఎత్తుకు ఎదిగాడు అత‌డు. 11ఏళ్ల వ‌య‌సులో ఇంటి నుంచి న‌గ‌రానికి వెళ్లిపోయిన అత‌డు లైఫ్ లో చాలా అవ‌స్త‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ప్ర‌ముఖ గాయ‌కుడిగా, గొప్ప స్టార్ గా వెలిగిపోతున్నాడు. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటున్నాడు.

పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ వివాహం చేసుకున్నారు.. అతడి భార్య, కుమారుడు US లో నివసిస్తున్నారని తాజాగా అత‌డి స్నేహితుడు ఒక‌రు అస‌లు విష‌యాన్ని మీడియాకి చెప్పారు. దిల్జిత్ దోసాంజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా సెక్యూర్డ్‌గా ఉంటాడు. అత‌డు ఇటీవలే తన తల్లిదండ్రులతో తనకున్న సంబంధాల గురించి ఓపెన‌య్యాడు. తన కుటుంబం వివ‌రాలు తెలిపాడు. కానీ మీడియాలో అతడు తన భార్య -బిడ్డ గురించిన‌ ఊహాగానాలపై పెదవి విప్పకుండా మాట్లాడాడు. కానీ త‌న‌ స్నేహితుడు ఇప్పుడు దిల్జిత్ దోసాంజ్ వివాహం చేసుకున్నాడని, ఒక కుమారుడు కూడా ఉన్నాడని పేర్కొన్నాడు. ఈ వాదనలపై దిల్జీత్ ఇంకా స్పందించలేదని ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం వెలువ‌రించింది.

పంజాబీ గాయకుడు దిల్జీత్ భార్య ఇండో-అమెరికన్ అని వారికి ఒక కొడుకు ఉన్నాడ‌ని స్నేహితుడు పేర్కొన్నాడు. అత‌డు చాలా ప్రైవేట్ వ్యక్తి .. అతడి కుటుంబం గురించి బ‌య‌టి వారికి చాలా తక్కువగా తెలుసు.. గుడ్ న్యూజ్ మోషన్ల సమయంలో సహనటి కియారా అద్వానీ కూడా అనుకోకుండా దిల్జిత్ దోసాంజ్‌కి ఒక బిడ్డ ఉన్నాడ‌ని వెల్లడించింది. ఆ సమయంలో ఒక‌ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. తారాగణంలోని ప్రతి ఒక్కరికీ పిల్లలు ఉన్నారని దిల్జిత్ కూడా తండ్రి అని సూచిస్తూ కియారా వ్యాఖ్యానించారు. నేను చాలా నేర్చుకుంటున్నాను.. ఎందుకంటే ఇక్కడ పిల్లలు లేని వ్య‌క్తి నేను మాత్రమే..! అని చెప్పింది.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానున్న `అమ‌ర్ సింగ్ చ‌మ్కీలా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న‌ దిల్జిత్ త‌న త‌ల్లిదండ్రుల‌తో త‌న బంధం గురించి తాజా ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసారు. త‌న 11 సంవత్సరాల వయస్సులో కుటుంబాన్ని వదిలి గ్రామం నుండి బయటకు వెళ్లవలసి వచ్చిందని వెల్లడించాడు. యూట్యూబర్ తో చాటింగ్‌లో దిల్జీత్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు తన మామ (మామా జీ)తో కలిసి జీవించడానికి పంపారని గుర్తు చేసుకున్నారు. అక్క‌డ అంతా బాగానే ఉంది కానీ, త‌న‌ను అడ‌గ‌కుండానే త‌న త‌ల్లిదండ్రులు ఊరి నుంచి పంపేసార‌ని ఆవేద‌న చెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులతో బంధం తెగిపోయింది. కానీ ఇప్పటికీ వారిని గౌరవిస్తున్నట్లు దిల్జీత్ తెలిపారు.

Tags:    

Similar News