రాజుగారు న్యూ జర్నీ..మనసు మార్చుకున్నారా?
ఇతర చిత్రాల్ని విక్రయించి బిజినెస్ చేస్తూ సక్సస్ ఫుల్ గా ముందుకెళ్తు న్నారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
మార్కెట్ లో ఓటీటీల హవా ఎలా నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు. థియేట్రికల్ బిజినెస్ మించి ఓటీటీలో జరుగుతోంది. ఓటీటీ ఆదరణ అంతకంతకు పెరగడంతో! నటీనటులు ఓటీటీ రిలీజ్ లకి అంతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నిర్మాతల్లో అల్లు అరవింద్ ఆహా పేరుతో ఓటీటీ నిర్వహిస్తున్నా రు . ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంకా చాలా మంది చిన్న నిర్మాతలు సొంతంగా ఓటీటీలు ఏర్పాటు చేసుకున్నారు.
సొంత సినిమాలతో పాటు..ఇతర చిత్రాల్ని విక్రయించి బిజినెస్ చేస్తూ సక్సస్ ఫుల్ గా ముందుకెళ్తు న్నారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. చిన్న సినిమాల కోసం ఆయన సొంతంగా ఓటీటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనని వృద్దిలోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. పెద్ద సినిమాలకు ఎలాగూ థియేట్రికల్ ఇబ్బంది లేదు.
చిన్న సినిమాలకు ఓటీటీ ఉపయుక్తంగా మారడంతో తానే స్వయంగా రంగంలోకి దిగితే తన సినిమాలతో పాటు ..చిన్న సినిమాలకు ఆసరాగా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏటా ఆయన చాలా సినిమాల్ని పంపిణీ చేస్తుంటారు. వాటిని కూడా సొంత ఓటీటీలో రిలీజ్ చేసుకునేలా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ లోకి ఆయన సోలోగా దిగుతారా? ఎవరైనా భాగస్వామిని చేర్చుకుంటారా? అన్న సందేహం కూడా ఉంది.
ఈ ఓటీటీ కోసం తొలుత ఐదు కోట్ల బడ్జెట్ తో 25 సినిమాలు నిర్మించి రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నా రుట. 2024 కల్లా తన ప్లాన్ అమలు పరచాలని భావిస్తున్నారుట. రాజుగారు ఇంతకాలం ఓటీటీలోకి రాకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన దృష్టిలో సినిమా అంటే థియేటర్లో చూస్తే సినిమా ఫీల్ కలుగు తుందని బలంగా నమ్ముతారాయన. ఓటీటీలో ఇంట్లో కూర్చుని థియేటర్లో..స్మార్ట్ ఫోన్లో చూస్తే అంత కిక్ ఉండదని విశ్వసించేవారు. ఆరంభంలో ఓటీటీ గురించి అడిగితే ఇలాగే స్పందించారు. అయితే ఇప్పుడు ఓటీటీ ఆదరణ చూసి రాజుగారు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.