దెయ్యం ప్రేమపై దిల్ రాజు నమ్మకం.. ఏ స్థాయిలో ఉందంటే..

ప్రస్తుత కాలంలో హారర్ సినిమాలు క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక అందుకే దిల్ రాజు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

Update: 2024-05-14 06:01 GMT

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా పక్కా ప్రణాళికతో ఫినిష్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలకు బడ్జెట్ లు ఊహించిన విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది.

అయినప్పటికీ సినిమాను మంచి కంటెంట్ తో విడుదల చేయాలి అని అడుగులు వేస్తున్నారు. అయితే మరొకవైపు తన సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి నీ కూడా మంచి హీరోగా నిలదొక్కుకునేలా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొడుకు పై ఉన్న ప్రేమ, బడ్జెట్ పరిధులను కూడా దాటేస్తోంది. ఆశిష్ రెడ్డి పై ఎలాంటి లిమిట్స్ లేకుండా ఖర్చు చేస్తున్న విధానం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారుతుంది

ఆశిష్ రెడ్డి మొదటి సినిమా రౌడీ బాయ్స్ కోసమే ఆయన భారీగా ఖర్చు చేశారు. అయితే ఆ సినిమా అంచనాలు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక తర్వాత గ్రాండ్ గా సెల్ఫిష్ అనే సినిమాను కూడా మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా హఠాత్తుగా ఆగిపోయింది. ఆ విషయంపై ఇప్పటికి కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ ఎక్కువగా లవ్ మీ అనే సినిమా పైనే ఉంది. ఈ సినిమా ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ హారర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుత కాలంలో హారర్ సినిమాలు క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక అందుకే దిల్ రాజు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

మంచి అవుట్ ఫుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ కావడం లేదు. కొత్త దర్శకుడు అరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కొన్ని సన్నివేశాలు పర్ఫెక్ట్ గా అనిపించకపోవడంతో మళ్లీ రీ షూట్ మూడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సినిమాను మే 25వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా కొన్ని సన్నివేశాలను మళ్లీ షూట్ చేయ్యాలి అని ఇటీవల దిల్ రాజు దర్శకుడికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమా కోసం దాదాపు 18 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన ఒక పాట మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రత్యేకంగా నిలవబోతున్నట్లు సమాచారం. కీరవాణి కూడా ఇప్పటివరకు ఇలాంటి జానర్ లో సినిమా చేయలేదు. కాబట్టి ఆయనకు కూడా ఇది మంచి ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మరి లవ్ మీ సినిమా ఆశిష్ రెడ్డికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News