IFFI 2024లో హరిష్ శంకర్..మ్యాటర్ ఏంటంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ మంచి గుర్తింపుని అందుకున్నారు.

Update: 2024-11-18 12:59 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ మంచి గుర్తింపుని అందుకున్నారు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘మిరపకాయ’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన హరిష్ శంకర్, తన ప్రత్యేకమైన టేకింగ్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపును తీసుకువచ్చారు.

రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ ఫినిష్ చేసి ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ మేకర్ గా కూడా క్రేజ్ అందుకున్నారు. అయితే ఇప్పుడు, హరిష్ శంకర్‌ ఒక గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో హరీష్ శంకర్ ను (IFFI) వెబ్ సిరీస్ (OTT) విభాగానికి జ్యూరీగా ఎంపిక చేయడంతో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు ఇది గర్వకారణం కూడా.

ఈ ప్రతిష్టాత్మక వేడుక నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగుతుంది. హరిష్ శంకర్ వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ కంటెంట్ ను ఎంపిక చేసే జ్యూరీలో భాగమవుతుండడం ప్రత్యేకం. తెలుగు చిత్రసీమలో తన ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన హరిష్ శంకర్, 2006లో ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు అందుకున్నారు.

ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలతో బిగ్ కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు. ఇక ‘రామయ్య వస్తావయ్య’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘గడ్డలకొండ గణేష్’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలను రూపొందించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతానికి, ఆయన పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హరిష్ శంకర్ అందించిన వైవిధ్యభరితమైన సినిమాలు ఆయనకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఇక వెబ్ సిరీస్ విభాగంలో ఉన్న ప్రతిభావంతులైన కథలను, దర్శకులను ఎంచుకోవడంలో హరిష్ శంకర్ కీలక పాత్ర పోషించనున్నారు. IFFI 2024 జ్యూరీలో భాగస్వామ్యం కావడం ద్వారా హరిష్ శంకర్ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఈ గుర్తింపు ఆయన టాలెంట్‌కి అద్దం పడుతుంది. "ఇంతటి గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు మరింత ప్రోత్సాహం అందిస్తోంది" అని హరిష్ శంకర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News