పెద్ద హీరో చేసిన పాడు పని!
ఆసక్తికరంగా ఈ హీరో నిజ జీవితంలో సంఘటనలనే తెలుగు దర్శకుడు తెరపై చూపించి 900కోట్లు వసూలు చేసిన సినిమాని తీసాడు.
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక మనిషే కదా!.. తప్పులు చేయకుండా ఉంటారా? పైగా ఈ స్టార్ హీరో బాగా చిలిపి. అల్లరివాడు. సాధా సీదాగా ప్రవర్తిస్తాడు. తాను ఒక సెలబ్రిటీని అనే గర్వం కూడా చూపించడు. ఒక సాధారణ గల్లీ యువకుడిలా అతడు నిర్లజ్జగా బిహేవ్ చేస్తాడు. అతడిని చూడగానే పెద్దగా పరిణతి చెందలేదు అని భావిస్తారు. మీడియా ముందు అతడి ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉంటుంది. కారణం ఏదైనా కానీ.. అతడు చేసిన చాలా అల్లరి పనులకు తండ్రి నుంచి చీవాట్లు తినాల్సి వచ్చేది.
అంతేకాదు.. తాను ఎప్పుడూ తన తండ్రికి చేరువ కాలేకపోయానని కూడా ఆ స్టార్ హీరో అంగీకరించాడు. తన తండ్రి తన తల్లిని తిడుతుంటే బాల్యంలో అది వినలేక దూరంగా ఎక్కడికో వెళ్లిపోయి కుమిలిపోయిన సందర్భాలున్నాయని కూడా బహిరంగంగా అంగీకరించాడు. తన తల్లిదండ్రులు గొడవలు పడటం తనను చిన్నతనంలో ఎంతగా వేదనకు గురి చేసిందో కూడా చెప్పాడు. ఆసక్తికరంగా ఈ హీరో నిజ జీవితంలో సంఘటనలనే తెలుగు దర్శకుడు తెరపై చూపించి 900కోట్లు వసూలు చేసిన సినిమాని తీసాడు.
అదంతా సరే కానీ.. ఆ పెద్ద స్టార్ చేసిన ఓ పాడు పని గురించి ఇప్పుడు నెటిజనుల్లో చర్చ సాగుతోంది. అంతగా పాడు పని ఏం చేసాడు? అంటే.. అతడు ఓసారి నగరంలోని రోడ్ లో వెళుతూ కార్ ఆపి పక్కనే నిలుచుని మూత్ర విసర్జన చేసాడు. అయితే అటుగా వచ్చిన సిన్సియర్ పోలీస్ హీరోగారు సారీ చెప్పేవరకూ సతాయించాడు. పోలీస్ తన వద్దకు రాగానే పదే పదే 'సారీ సారీ సారీ ..' అంటూ తప్పించుకోజూసాడు. కానీ అతడు వదిలిపెట్టలేదు. ఇలాంటి పాడు పని మరోసారి చేయనని ప్రామిస్ చేసేవరకూ విడిచిపెట్టలేదు. ఆ సమయంలో సిన్సియర్ పోలీస్ దెబ్బకు ఆ స్టార్ హీరో సారీ చెప్పడమే గాక తనను వదిలేయాలని బాగా ప్రాధేయపడాల్సి వచ్చిందట. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా కానీ అతడు కూడా మనిషే కదా! ఆ సమయంలో అర్జెంట్ అయిపోయిందేమో పాపం!! అంటూ అభిమానులు వకాల్తా పుచ్చుకుంటున్నారు!