ఇప్పుడు పవన్ నిర్మాతలా ప్లాన్ ఏంటి?

వాటి పాలనా బాధ్యతలు పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సి ఉంటుంది.

Update: 2024-06-17 07:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎలక్షన్స్ వైబ్ లోనే ఉన్నారు. పదేళ్ళ నిరీక్షణ తరువాత వచ్చిన ఈ విజయం ఫ్యాన్స్ కు మర్చిపోలేని వేడుక అని చెప్పవచ్చు. కష్టపడి ఒక రాజకీయ నాయకుడిగా మారి 2024 ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకోనున్నారు. దాంతో పాటుగా మరో ఐదు మంత్రిత్వ శాఖలని కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించారు. వాటి పాలనా బాధ్యతలు పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వ పరిపాలనలో భాగమైన పవన్ ఈ ఐదేళ్లు సమర్ధవంతమైన నాయకుడిగా వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, పార్టీ బలం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కూడా దానిపైనే తన ఫోకస్ అంతా పెట్టబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా ఆయనతో సినిమాలు చేస్తోన్న నిర్మాతలు కాస్త టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

డివివి దానయ్య నిర్మిస్తోన్న ఓజీ, మైత్రీ మూవీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్, ఏఎం రత్నం నిర్మిస్తోన్న హరిహరవీరాళ్లు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు షూటింగ్ చివరి దశకి వచ్చేశాయి. ఒక్కో సినిమాకి 30-50 రోజుల కాల్ షీట్స్ ఇస్తే ఆ సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపోతాయనే మాట వినిపిస్తోంది. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారని దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా నిర్మాతలు ధైర్యంగా ఆయన్ని అడగలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫోన్ చేసి షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెబుతాడా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ చేసే అవకాశం లేదని సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. కానీ పవన్ ఎలా ఏమాత్రం వదిలేయరు అని చెప్పవచ్చు. ప్రజా పాలనకు ఏమాత్రం ఇబ్బంది కలాక్కుండా సినిమాలను ఫినిష్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అలాగే పవన్ త్వరలో నిర్మాతలని కలిసి షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఓజీ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని నిర్మాత భావిస్తున్నారు. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని వచ్చే ఏడాది పెట్టుకోవడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఓజీ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలో పూర్తి చేస్తాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News