బౌన్స్ బ్యాక్ కోసం శ్రీకాంత్ అడ్డాల యూ టర్న్!
టాలీవుడ్ డైరెక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒకే ఫార్ములాని ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తుంటారు.
టాలీవుడ్ డైరెక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒకే ఫార్ములాని ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తుంటారు. ఆ ఫార్ములా వదిలి బయటకు రావడం అన్నది చాలా రేర్. అలా బయటకు వచ్చి చేసినా అది సాహసం అవుతుంది. అందుకే వీలైనంత వరకూ కంపర్ట్ జోన్ లోనే సినిమాలు చేయడానికి చూస్తారు. వరుస వైఫల్యాలు ఎదురైనా ఆజానర్ ని అంత తొందరగా విడిచిపెట్టరు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం `పెదకాపు`తో ఓ కొత్త సాహసం చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా ఫలితం గురించి విధితమే. అంతకు ముందు అదే జానర్ లో ఓ తమిళ సినిమా రీమేక్ కి పనిచేసిన అనుభవంతో కొత్త ప్రయత్నం చేసాడు. స్టోరీపై నమ్మకంతో `పెదకాపు-2` కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించాడు. కానీ `పెదకాపు-1` ఫలితంతో ఇప్పుడా ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ పాత ఫార్ములా వైపే ఆసక్తి చూపిస్తున్నట్లు వినిపిస్తుంది.
మళ్లీ తనదైన శైలి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసే పనిలో బిజీ అయినట్లు సమాచారం. `కొత్త బంగారు లోకం`..`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` లాంటి విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్ మళ్లీ అదే తరహా సినిమాలు చేయడానికి యూటర్న్ తీసుకున్నట్లు వినిపిస్తుంది. కొత్త జానర్ లో ట్రై చేసి చేతులు కాల్చుకోవడం కన్నా సక్సెస్ జానర్ ని నమ్ముకుంటే యావరేజ్ ఫలితాలైనా సాధించొచ్చు అన్న ధీమాకి వచ్చేసినట్లు వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ఫ్యామిలీ స్టోరీ సిద్దం చేసినట్లు సమాచారం. ఇటీవలే ఓ యంగ్ హీరోకి ఆ స్టోరీ చెప్పాడుట. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అతను గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకా కథలో అవసరమైన మార్పులు..బలమైన సన్నివేశాలు కుదిరిలే డెవలెప్ చేస్తే తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ చేయోచ్చని ప్లాన్ చేస్తున్నారుట. ఇది మంచి ఆలోచనే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకు ప్రేక్షకులు ఎప్పుడు పెద్ద పీట వేస్తారు.
ఇలాంటి కథలు సిద్దం చేయడం అడ్డాలకు కొట్టిన పిండి లాంటింది. ఎమోషన్ ని అద్భుతంగా క్యారీ చేయగల దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కథలో కొత్తదనం ఉంటే చాలు అడ్డాల మార్క్ ఎంటర్ టైనర్ కి ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు. అనీల్ రావిపూడి అలాంటి స్టోరీలకే తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ జోడించి హిట్లు అందుకుంటున్నాడు.