సుక్కూ కుమార్తె షో స్టాపర్
సుకృతి ర్యాంప్ వాక్ లోను షో స్టాపర్ గా నిలుస్తోందని తాజా ఈవెంట్ నిరూపించింది. ఈ యువ నటి ఇటీవల డిజైనర్ రెనీ క్రిస్టల్ కోచర్ కోసం ర్యాంప్ వాక్ చేసింది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ పేరు 'పుష్ప' ఫ్రాంఛైజీతో జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. అతడి నుంచి 'పుష్ప 2' సంచలనాలకు తెర తీయనుందని భావిస్తున్నారు. ఇంతలోనే సుకుమార్- తబితా సుకుమార్‌ల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో తన అసాధారణ నటనతో మెప్పించారు. ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ బాలనటి విభాగంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవం సుకృతి ప్రతిభను, నటిగా అంకితభావాన్ని ఆవిష్కరించింది. నటిగా సుకృతికి మంచి భవిష్యత్ ఉందని కూడా అర్థమైంది.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతున్న సుకృతికి అంతర్జాతీయ స్థాయిలోను గుర్తింపు దక్కింది. గాంధీ తాత చెట్టు చిత్రంలో తన నటప్రదర్శనకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఆరంగేట్ర బాలనటిగా పురస్కారాలు దక్కాయి. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ , గోపీ టాకీస్ నిర్మించాయి. పద్మావతి మల్లాది దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్, శేష సింధూరావు నిర్మాతలు.
ర్యాంప్‌పై షో స్టాపర్:
సుకృతి ర్యాంప్ వాక్ లోను షో స్టాపర్ గా నిలుస్తోందని తాజా ఈవెంట్ నిరూపించింది. ఈ యువ నటి ఇటీవల డిజైనర్ రెనీ క్రిస్టల్ కోచర్ కోసం ర్యాంప్ వాక్ చేసింది. ర్యాంప్ పై నీలిరంగు మినీ డ్రెస్‌లో సుకృతి చాలా అందంగా కనిపించింది. ఎంపిక చేసుకున్న హెయిర్ స్టైల్... స్పైక్స్... ఆభరణాలు అన్నీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. సుకృతి చిరునవ్వులతో ర్యాంప్ పై అందంగా నడిచింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సుకృతి ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. సుకృతి నటిగా ఇప్పటికే ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. సుకృతి సాధించిన విజయాలు తన అంకితభావాన్ని, ప్రతిభను ప్రతిబింబిస్తాయి. పరిశ్రమలోని యువ కళాకారులకు సుకృతి స్ఫూర్తిగా నిలిచింది. యంగ్ స్టార్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.