మంచం పై డబ్బులేసుకుని పడుకునేది!
తాజాగా డిస్కోశాంతి ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
ఒకప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేసినా సిల్క్ స్మిత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ స్టార్ హీరోయిన్ మించిన క్రేజ్ ని ఓ నర్తకి దక్కించుకోవడం అదే తొలిసారి. చివరి సారి కూడా. సిల్క్ స్మితకంటే ముందు..తర్వాత ఎంతో మంది డాన్సర్లు వచ్చారు. వెళ్లారు. కానీ సిల్స్ స్మిత అయినంత ఫేమస్ ఎవరూ కాలేకపోయారు. ఇప్పటికీ అదే ఇమేజ్ తో సిల్క్ స్మిత్ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటు న్నవారెంతో మంది.
ఇదంతా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. ఆమె గురించి తెలియని ఎన్నో విషయాలున్నాయి. తాజాగా డిస్కోశాంతి ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
ఆవేంటో ఆమె మాటల్లోనే..ప్రస్తావించారు. 'సిల్క్ స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. చాలా మంచిది . కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ముంబైలో ఉన్న నేను షాక్ అయ్యాను.
తన భర్త గురించి .. ఆ భర్తకు ఆల్రెడీ ఉన్న పిల్లలను గురించి నాతో చెబుతూ ఉండేది. నా దగ్గర ఏ విషయాలు దాచేది కాదు. అప్పట్లోనే స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకి లక్ష నుంచి మూడు లక్షలు తీసుకునేది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. స్మిత నెలకి ఐదు లక్షలు చెల్లించి అద్దె ఇంట్లో ఉండేది.
సొంత ఇల్లే కొనుక్కోవచ్చు కదా? అనే దానిని. నిజానికి ఆమెది చాలా విలాసవంతమైన జీవితం. మంచంపై డబ్బు పరుచుకుని పడుకునేది. నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను' అని చెప్పింది. సెట్లో తనని చాలా గౌరవంగా చూసేవారు' అని అన్నారు.