కల్కి - కంగువా.. మళ్ళీ అలానే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని ఈ ఏడాది ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో కనిపించింది.

Update: 2024-10-24 05:46 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని ఈ ఏడాది ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో కనిపించింది. నిజానికి ఈ చిత్రంలో ఆమె ప్రభాస్ కి జోడీగా, హీరోయిన్ అనే ప్రచారం నడిచింది. అయితే ‘కల్కి’ మూవీ చూసిన తర్వాత ఆమె పాత్ర నిడివి చూసి అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా దిశా పటాని ఫ్యాన్స్ అయితే చాలా డిజపాయింట్ అయ్యారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలకి మించి లేదు. కేవలం కథకి ఒక సపోర్టింగ్ గా మాత్రమే ‘కల్కి’ చిత్రంలో దిశా పటాని కనిపించింది.


ఇక సూర్య పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’లో కూడా దిశా పటాని నటించింది. ఈ సినిమాలో అయిన ఆమె పాత్రకి మంచి స్కోప్ ఉంటుందా అంటే కష్టమనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం ‘కంగువా’ సినిమాలో ఆధునిక కాలానికి సంబందించిన ఎపిసోడ్ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుందంట. అంది కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందులో స్టోరీ మొత్తం సూర్య క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని టాక్.


దిశా పటాని క్యారెక్టర్ కూడా ‘కంగువా’ మూవీలో ప్రెజెంట్ టైం లైన్ స్టోరీలో ఉండబోతోంది. అంటే ఈ చిత్రంలో కూడా ఆమె క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. మరోసారి ఆమె ఫ్యాన్స్ ని ‘కంగువా’ కూడా డిజపాయింట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న దిశా పటానికి సౌత్ లో అవకాశాలు వస్తున్న కూడా చెప్పుకోదగ్గ పాత్రలు రావడం లేదని అనిపిస్తోంది.


పేరుకి పాన్ ఇండియా సినిమాలలో హీరోయిన్ అనే ఇమేజ్ ఉన్న కూడా స్క్రీన్ టైం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆమె కూడా ప్రమోషన్స్ కి రావడం లేదని అనుకుంటున్నారు. దిశా పటాని లాంటి బ్యూటీస్ ని తీసుకున్నప్పుడు వారికి మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇస్తే మూవీకి అదనపు అసెట్ అవుతారని సినీ విశ్లేషకులు అంటున్నారు.


కనీసం గ్లామర్ పరంగా ఆకట్టుకునే పాత్రలు కూడా దిశా పటానికి దక్కకపోవడం ఆమెని కూడా నిరుత్సాహానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. అయితే ‘కల్కి పార్ట్ 2’ ఉంది, అలాగే ‘కంగువా’ నుంచి కూడా ఇంకో పార్ట్ రావాల్సి ఉంది. వాటిలో ఏమైనా దిశా పటాని యాక్టింగ్ కి స్కోప్ దొరుకుతుందేమో చూడాలి.

Tags:    

Similar News