పిక్‌టాక్ : బటన్ విప్పి బ్యూటీ షో..!
తెలుగు ప్రేక్షకులకు 'లోఫర్' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని.
తెలుగు ప్రేక్షకులకు 'లోఫర్' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. దాంతో టాలీవుడ్‌లో ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. 2016లో ఎంఎస్ ధోనీ సినిమాలో నటించడం ద్వారా ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తూ ఈ అమ్మడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది.
గత ఏడాది తెలుగులో మరోసారి 'కల్కి 2898 ఏడీ' సినిమాతో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. గత ఏడాదిలోనే మరో సౌత్ సినిమా కంగువాలోనూ దిశా పటాని నటించింది. సూర్య హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. పైగా ఆ సినిమాలో దిశా పటాని పాత్ర పెద్దగా లేదు. ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు ఒక సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు రెండు హిందీ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
సినిమాలతో బిజీగా ఉన్నా దిశా పటాని సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన విభిన్నమైన ఔట్ ఫిట్‌తో ఆకట్టుకుంది. ఈసారి లాంగ్ బ్లేజర్ ధరించి, బటన్స్ విప్పడం ద్వారా కాల్విన్ క్లైన్ ఇన్నర్‌ను షో చేసింది. క్లీ వేజ్ షో తో చూపు తిప్పనివ్వని ఈఅమ్మడి అందంకి టాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లు క్లీవేజ్ షో అందాలు ఆకట్టుకున్నాయి.
1992లో ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన దిశా పటానీ చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. దిశా పటాని తండ్రి జగదీష్ సింగ్ పటాని పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఇక సోదరి ఖుష్బూ పటాని భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దిశా పటాని బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇంజనీరింగ్ చదివిన దిశా బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్‌కి సమానంగా పారితోషికం అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడిని ఏకంగా 61.5 మిలియన్‌ల మంది ఫాలో అవుతున్నారు.