దివి.. ఇంత అందంగా కనిపిస్తే ఎలా..
ఈ ఫోటోలు చూసిన అభిమానులు 'ఫొటో కాదు.. కవితలా ఉంది', 'సాంప్రదాయానికి గ్లామర్ టచ్ ఇచ్చావు' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.;

తెలుగు ప్రేక్షకులకు ‘బిగ్ బాస్’ ద్వారా పరిచయమైన దివి వాధ్య సొగసుల తారగా ఎదుగుతున్న నటి. గ్లామర్‌కు తగ్గటే, తను ఎంచుకునే డ్రెస్‌లు, ఫోటోషూట్లు, స్టైలింగ్ అన్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆమె పంచుకున్న ట్రెడిషనల్ అవతార్‌లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీలి లెహంగా, మల్టీ కలర్ హ్యాండ్లూమ్ చోళితో డివి చేసిన ఈ ఫోటోషూట్ చాలా అందంగా ఉంది.

చేతులను పైకి ఎత్తుతూ తీసుకున్న స్టిల్స్‌లో ఆమె స్టిల్, ఫీల్ చూసినవాళ్లను కట్టిపడేస్తోంది. ‘నువ్వు చూసి వెళ్ళిపోతావు.. నీకు కనపడని దృశ్యాలా మేము మిగిలిపోతాం’ అంటూ క్యాప్షన్ కూడా వైరల్ అవుతుండడం విశేషం. దివి కెరీర్‌పై ఓ లుక్కేస్తే.. ‘మహర్షి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తర్వాత బిగ్ బాస్-4లో భాగమైంది. అక్కడ తన అందం, స్వభావంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత 'లంబసింగి' అనే సినిమాతో హీరోయిన్‌గా మారిన డివి, ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌లో కూడా భాగమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ట్రెడిషనల్ లుక్స్, మోడ్రన్ ఫోటోషూట్లు.. ఇలా విభిన్నంగా కనిపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఈ లెహంగా ఫోటోషూట్‌లోని ఫొటోలే ఇందుకు నిదర్శనం. ప్రతి ఫ్రేమ్‌లోనూ దివి ఒక నెమలి అందంతో మెరిసిపోతోంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు 'ఫొటో కాదు.. కవితలా ఉంది', 'సాంప్రదాయానికి గ్లామర్ టచ్ ఇచ్చావు' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. దివి ప్రస్తుతం వెబ్ సిరీస్‌లను కూడా ఎంచుకుంటూ తన పరిధిని పెంచుకుంటోంది. ఇక ఆమె కెరీర్ మరింత మెరుగైన స్థాయికి ఎలా చేరుకుంటుందో చూడాలి. కానీ ఈ ఫోటోలు మాత్రం ఆమె ఫ్యాషన్ సెన్స్‌కు అద్దం పడుతున్నాయనడం మాత్రం నిజం.