దివి నేచర్ ఎన్‌కౌంటర్.. తడిసిన అందాలతో ఇలా..

సోషల్ మీడియా ద్వారా తరచూ తన అందం, ఫిట్‌నెస్ స్టిల్స్ ని షేర్ చేసుకునే దివి, ఈసారి మరో అద్భుతమైన ఫోటోషూట్ తో అభిమానుల మనసు గెలుచుకుంది

Update: 2024-10-25 09:21 GMT

సోషల్ మీడియా ద్వారా తరచూ తన అందం, ఫిట్‌నెస్ స్టిల్స్ ని షేర్ చేసుకునే దివి, ఈసారి మరో అద్భుతమైన ఫోటోషూట్ తో అభిమానుల మనసు గెలుచుకుంది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పంచుకోగా, వాటిలో స్విమ్మింగ్ పూల్ లో ప్రకృతి ఒడిలో ఆనందంగా విహరిస్తూ కనిపించింది. ఈ ఫోటోలపై అభిమానులు అమితమైన ఆదరణ చూపిస్తూ, ఫిదా అవుతున్నారు.

ఇక ఈ ఫోటోలతో పాటు దివి ఇచ్చిన క్యాప్షన్ కూడా అందరి హృదయాలను కదిలించింది. “సహజమైన కొలనులో ఈత కొట్టడం ద్వారా రోజును ప్రారంభించడంలో నిజంగా ఏదో అద్భుతం ఉంది, దాని చుట్టూ ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి...” అంటూ నేచర్ లో ఉన్న అందాన్ని, ప్రశాంతతను చాలా అందంగా వివరిస్తూ తన ఫీల్ ని వ్యక్తపరిచింది. ఈ పిక్స్ చూస్తేనే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుండగా, దివి తన ఫిజిక్ తో కూడా ట్రెండ్ సెట్ చేసింది.

ప్రకృతి మధ్యన స్విమ్ చేస్తూ, పూల్ లో నీటిలో తేలుతూ తన ఆనందాన్ని వెలిబుచ్చిన దివి, ఉదయపు కాంతిలో మెరిసిపోతోంది. ఇలా ప్రకృతి అందాలు, పక్షుల చప్పుడు, వీస్తున్న కమ్మని గాలిలో ఆమెకి లభించిన ప్రశాంతత.. అందరిని కట్టిపడేసింది. ఈ మేజికల్ మూమెంట్స్ ఆమె అభిమానులను ఇన్‌స్టాగ్రామ్ లో తెగ ఆకట్టుకుంటున్నాయి.

వీటితో పాటు, దివి తన పుట్టుక ప్రకృతి దగ్గరకి తిరిగి రావడానికి, అందులోని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఎంత ప్రేమ చూపిస్తుందో కూడా వెల్లడించారు. ప్రస్తుతం దివి ఫిట్‌నెస్, గ్లామర్ ని కేవలం తెరపై మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా హైక్ట్ చేస్తూ, తన అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. ఇక ఆమె ఇటీవల పలు సినిమాలతో వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంది. తమిళంలో కూడా ఒక ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News