పిక్‌ టాక్ : తెల్ల చీరలో అందాల దివి

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ దివికి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది.

Update: 2024-05-28 06:07 GMT

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ దివికి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. అంతకు ముందు వరకు దివి గురించి సోషల్‌ మీడియా, బయట పెద్దగా తెలియదు. కానీ బిగ్‌ బాస్ తర్వాత దివి ఒక్కసారిగా హీరోయిన్‌ రేంజ్‌ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


బిగ్‌ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యింది. హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతా నోరు వెళ్లబెట్టే విధంగా హీరోయిన్‌ రేంజ్ లో స్కిన్‌ షో చేస్తూ నెట్టింట లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.


హీరోయిన్ గా కూడా ఇప్పటికే పలు సినిమాలు మరియు సిరీస్ ల్లో నటించిన అందాల దివి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి చీర కట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈసారి వైట్ అండ్ లైట్ ఎల్లో కలర్‌ చీర కట్టు లో ముద్దుగుమ్మ దివి నడుము అందం చూపిస్తూ సర్‌ప్రైజ్ చేసింది. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలను చూస్తూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత కేవలం దివికే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటోలతో పాటు ఇన్ స్టా లో దివి.. “కురిసే సిరి వెన్నెలలో నిలువెల్లా తడిసొద్దాం, రగిలే మన శ్వాసలో రేయి చలి మంటేద్దాం.” అనే పొయెటిక్ లైన్స్ ను షేర్‌ చేసింది. మొత్తానికి అందాల దివి చీర కట్టు ఫోటోలు వైరల్‌ అవ్వడంతో మరోసారి స్టార్‌ హీరోలకు ఈమె అందం కనిపించడం లేదా అంటూ ఆమె ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News