పెళ్లి పీటలెక్కుతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్టు దివ్య
మరికొందరు సినిమాల్లో లేదా మోడలింగ్ లాంటి వృత్తుల్లో సెటిలైపోయారు.
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారంతా ఇప్పుడు పెద్ద వాళ్లైపోయారు. పెద్దయ్యాక కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారితే, తేజ లాంటి వాళ్లు హీరోలుగా మారారు. మరికొందరు సినిమాల్లో లేదా మోడలింగ్ లాంటి వృత్తుల్లో సెటిలైపోయారు. వారిలో కొంతమందికి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ జాయిన్ కాబోతుంది.
అనుష్క బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతిలో చిన్నప్పుడు అరుంధతి పాత్ర పోషించిన అమ్మాయి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ చైల్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. ఆమె అరుంధతి సినిమాతో పాటూ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు అపరిచితుడు, సింగం పులి లాంటి సినిమాల్లో నటించింది. ఇవి కాకుండా పలు తెలుగు, తమిళ సినిమాల్లో దివ్య నగేష్ నటించింది.
ప్రస్తుతం దివ్య మోడల్, డ్యాన్సర్ గా చేస్తూనే నటిగా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది. దివ్య ఇప్పుడు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్ తో ప్రేమలో ఉన్న దివ్య త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. దివ్య ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2020లో అజిత్ తో తనకు పరిచయం ఏర్పడిందని, ఇప్పుడు 2025లో ఇద్దరం భార్యభర్తలం కాబోతున్నామని, అజిత్ తనకెంతో సపోర్ట్ చేస్తాడని కాబోయే భర్త గురించి దివ్య ఈ సందర్భంగా పోస్ట్ చేసింది. దివ్య షేర్ చేసిన ఫోటోలకు శుభాకాంక్షలు చెప్తున్న నెటిజన్లు, చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన దివ్యకు పెళ్లైపోతుందని కానీ అసలు అరుంధతి అయిన అనుష్కకు మాత్రం ఇంకా పెళ్లవడం లేదని కామెంట్ చేస్తున్నారు.
అనుష్కకు 43 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ఊసే మాట్లాడట్లేదు. గతంలో ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందన్నారు కానీ వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చేశారు. అనుష్కతో పనిచేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి కూడా అవుతున్న నేపథ్యంలో అనుష్క పెళ్లి వార్తను ఎప్పుడు వింటామా అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.