22 సినిమాల‌కు సైన్ చేసిన హీరోయిన్ !

మ‌రి ఒకేసారి 22 సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చింది బాలీవుడ్ న‌టి దివ్యాద‌త్.

Update: 2024-07-04 16:30 GMT

స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి రిలీజ్ చేయ‌డ‌మే క‌ష్ట‌మైన రోజులివి. అతి క‌ష్టం మీద ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ల అయితే ఐదారు సినిమాలు లేదా మ‌రో నాలుగు వేసుకుంటే ప‌ది సినిమాలు చేస్తున్నారు. అంత‌కు మించి కొత్త ప్రాజెక్ట్ లు క‌మిట్ అవ్వాలంటే? వ‌చ్చే ఏడాది చూద్దాంలే అనే ప‌రిస్థితి ఉంది. మ‌రి ఒకేసారి 22 సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చింది బాలీవుడ్ న‌టి దివ్యాద‌త్.

46 ఏళ్ల దివ్యాద‌త్ 1994లో కెరీర్ ప్రారంభించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టీవర‌కూ న‌టిగా కొన‌సాగుతుంది. అయితే 2007 కి ముందు ఏకంగా 22 సినిమాల‌కు సైన్ చేసిందిట‌. అదే స‌మ‌యంలో నిర్మాత ఆదిత్య చోప్రాని క‌లిసిందిట‌. ఆయ‌న కెరీర్ ఎలా ఉంది అని అడిగితే? 22 సినిమాలు చేస్తున్నాని చెప్పిందిట‌. ఆ స‌మ‌యంలో ఆదిత్య చోప్రా అన్ని సినిమాలు చేయ‌డం చూసి సంతోషిస్తార‌ని భావించిందిట‌.

కానీ ఆయ‌న నుంచి ఊహించ‌ని స‌మాధానం వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ సంగ‌తి చెప్ప‌గానే ఆదిత్య చోప్రా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారుట‌. కాసేప‌టికి మౌనం వీడు నాకు అర్దం కాలేదు? నీకు డ‌బ్బు అవ‌స‌రం ప‌డి అన్ని సినిమాల‌కు సైన్ చేసావా? నీ గుర్తింపు కాపాడుకో? ఎందుకిలా సినిమాలు చేస్తున్నావ‌ని అన్నారు. అప్పుడే అమ్మ‌డు ఆలోచ‌న‌లో ప‌డిందిట‌. ఇన్ని సినిమాలు చేయ‌డం క‌రెక్టేనా? అని పున‌రాలోచించుకుందిట‌.

ఏది ప‌డితే అది చేయ‌డం క‌న్నా మంచి పాత్ర‌లున్న సినిమా చూసుకోవాలని రియ‌లైజ్ అయిందిట‌. అప్ప‌టి నుంచి ఆదిత్యా చోప్రా మాట‌ల్ని గుర్తుపెట్టుకుని సైన్ చేయ‌డం మొద‌లు పెట్టిందిట‌. అలా చేయ‌డం వ‌ల్ల గ్రాఫ్ కూడా మెరుగు ప‌డింద‌ని తెలిపింది. అంతేగా నిక్క‌మైన నీల‌మొక్క‌టి చాలు. త‌ళుకుబెళుకు రాళ్లు త‌ట్టేడేలా.

Tags:    

Similar News

eac