దీపావళి సినిమాలు.. ఓటీటీ రిలీజ్ ఎందులో అంటే?

ఈ దీపావళికి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Update: 2024-11-02 05:02 GMT

ఈ దీపావళికి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో దేనికవే ప్రత్యేకత కలిగి ఉండడం విశేషం. తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’ మూవీస్ ప్రేక్షకులు ముందుకి వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. దీంతో ఈ రెండు సినిమాలకి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అలాగే తమిళంలో శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడిగా ‘అమరన్’ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జయం రవి ‘బ్రదర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. కన్నడ నుంచి శ్రీ మురళి హీరోగా తెరకెక్కిన ‘బఘీర’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగం ఎగైన్’ మూవీ రిలీజ్ అయింది.

హిందీలో భారీ మల్టీస్టారర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా విద్యాబాలన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘భూల్ భూలయ్యా 3’ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. హార్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమాకి నార్త్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఓవరాల్ గా దీపావళికి రిలీజ్ అయిన సినిమాలలో ఐదు చిత్రాలు కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీటిలో అత్యధిక కలెక్షన్స్ ఏ చిత్రానికి వస్తాయనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్స్ ముందుగానే సెట్టయ్యాయి. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, శివ కార్తికేయన్ ‘అమరన్’, ‘బఘీర’, ‘భూల్ భులయ్యా 3’ సినిమాల డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ ఓటీటీ పార్ట్ నర్ గా ఈటీవీ విన్ కన్ఫర్మ్ అయ్యింది. జయం రవి ‘బ్రదర్’ మూవీ జీ5 లో రిలీజ్ కానుంది.

‘సింగం ఎగైన్’ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వీటిలో సౌత్ సినిమాలు నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ సినిమాలు మాత్రం ఓటీటీలో కావడానికి 8 వారాల సమయం పట్టొచ్చు. వీటన్నింటిలోకి శివకార్తికేయన్ ‘అమరన్’ సినిమాకి యునానమస్ గా పాజిటివ్ టాక్ రావడం విశేషం. రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం కావడంతో అందులో ఎమోషన్ ఆడియన్స్ కి బలంగా కనెక్ట్ అయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News