బిగ్ బాస్ నుంచి గాడిదకు రిలాక్స్..!

బిగ్ బాస్ హిందీలో 18వ సీజన్ మొదటి ఎపిసోడ్ తోనే ఆడియన్స్ కు షాక్ ఇస్తూ గాడిదను హౌస్ లోకి పంపించారు.

Update: 2024-10-14 10:00 GMT

బిగ్ బాస్ హిందీలో 18వ సీజన్ మొదటి ఎపిసోడ్ తోనే ఆడియన్స్ కు షాక్ ఇస్తూ గాడిదను హౌస్ లోకి పంపించారు. అసలు గాడిదని ఎలా యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు. అది కూడా ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లింది. ఐతే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా దానికి సెపరేట్ సెటప్ చేసి హౌస్ లోకి పంపించారు. అక్టోబర్ 6న మొదలైన బిగ్ ఆస్ సీజన్ హిందీ సీజన్ 18 లో గాడిదను హౌస్ లోకి పంపించడంపై అన్ని చోట్ల విమర్శలు వచ్చాయి.

కంటెస్టెంట్ గా గాడిదని పంపించడంపై పెటా ఇండియా బిగ్ బాస్ టీం పై సీరియస్ అయ్యింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్ కు ఒక ప్రత్యేకమైన లెటర్ రాసింది పెటా ఇండియా. బిగ్ బాస్ లాంటి షోలో గాడిదను ఉపయోగించడం.. వినోదం కోసం ఇలా వాటిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పెటా ఇండియా రాసుకొచ్చింది. మీ పలుకుబడిని ఉపయోగించి షో నిర్వాహకులతో మాట్లాడి గాడిదను పంపించాలని లెటర్ లో రాశారు. ఐతే వారి విజ్ఞప్తి మేరకు సల్మాన్ ఖాన్ ఆ గాడిదని బయటకు పంపించేశారు.

బిగ్ బాస్ స్టేజ్ మీద గాడిదతో సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు కూడా కొందరిని ఇబ్బంది పెట్టాయి. గాడిదను గద్ రాజ్ అని పిలిచిన సల్మాన్ ఖాన్ నువ్వు గెలిస్తే ఎలా ఎత్తుకోవాలి.. నీ చెవులు పట్టుకుని ఎత్తుకుంటా.. అంటూ సల్మాన్ వ్యాఖ్యానించారు. ఐతే పెటా ఇండియా ఇలాంటివి మరోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని బిగ్ బాస్ టీం కు చెప్పింది.

బిగ్ బాస్ కన్నడలో కూడా చార్లీ 777 డాగ్ ని కంటెస్టెంట్ గా తీసుకు రావాలని ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. బిగ్ బాస్ హిందీ లో సీజన్ 18 లో గాడిద హౌస్ లోకి వెళ్లగా వారం లోనే దాన్ని వెనక్కి పంపించారు. మరి బిగ్ బాస్ టీం దాన్ని అసలు ఎందుకు హౌస్ లోకి తెచ్చారన్నది వారికైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. బిగ్ బాస్ హౌస్ లో మనుషులే చాలా అడ్జెస్ట్ అవుతూ ఉంటున్నారు. అలాంటిది జంతువులు ఎలా ఉంటాయని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే గాడిదని బయటకు పంపించడం వల్ల మ్యాటర్ క్లోజ్ అయినట్టే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News