‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్.. A అంటే స్టఫ్ గట్టిగానే..

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను పొందింది.

Update: 2024-08-10 11:03 GMT

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను పొందింది. ఈ ట్రైలర్‌లో రామ్ పవర్ఫుల్ పెర్ఫెమెన్స్ హైలెట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది.


ఇక సినిమా సెన్సార్ టీమ్ నుంచి A సర్టిఫికెట్‌ను పొందింది. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోస్ మరింత పెరిగాయి. సినిమా పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, కమర్షియల్ అంశాలు హైలైట్ అయ్యాయని అర్ధమవుతుంది. 2 గంటల 42 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం వేగవంతమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

మొదటి భాగంలో ఇంటర్వెల్ సన్నివేశం హైలైట్ గా నిలవగా, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలను కలిగి ఉంది. పూరి జగన్నాథ్ తన మార్క్ స్టైల్ లో యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌ను సమపాళ్లలో మిక్స్ చేసి మంచి ఎంటర్టైనర్ అందించారని తెలుస్తోంది.

హీరో రామ్ పోతినేని తన పవర్ఫుల్ పెర్ఫెమెన్స్ ఆకట్టుకోగా, సంజయ్ దత్ పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఫేస్-ఆఫ్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చెప్పవచ్చు. అలాగే రామ్, కావ్య థాపర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా యువతను మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందట. అలీ కామెడీ పాత్ర ఈ సినిమాలో మరో స్పెషల్ రోల్ అని అర్ధమవుతుంది.

మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ అన్ని అంశాలతో ‘డబుల్ ఇస్మార్ట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతోంది. అమెరికాలో ఈ చిత్రానికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావించవచ్చు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News