హిందీ లెక్క.. ఇస్మార్ట్ కంటే లైగర్ డబుల్ బెటర్..
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ రెండేళ్లు గ్యాప్ తీసుకొని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ రెండేళ్లు గ్యాప్ తీసుకొని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంతో కచ్చితంగా పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరూ భావించారు. అయితే పూరి జగన్నాథ్ తనకి అలవాటైన రెగ్యులర్ టెంప్లెట్ లోనే డబుల్ ఇస్మార్ట్ కథని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. మెమొరీ చిప్ ట్రాన్స్ ఫర్ అంటూ కొత్త పాయింట్ టచ్ చేసిన కూడా కథనం విషయంలో పూరి జగన్నాథ్ పెద్దగా మార్పులు చేయలేదు.
ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేశారు. అయితే ఇస్మార్ట్ శంకర్ మీద ఉన్న క్రేజ్ కూడా డబుల్ ఇస్మార్ట్ కి కలిసి రాలేదనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా దారుణంగా వచ్చాయి. మొదటి ఆటకే డివైడ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. దీంతో మూవీ థీయాట్రికల్ బిజినెస్ లో కనీసం 25 శాతం కలెక్షన్స్ కూడా డబుల్ ఇస్మార్ట్ రికవరీ చేయలేదు.
ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఆయనకి 15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. అయితే సంజయ్ దత్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ లో 10 శాతం కలెక్షన్స్ కి కూడా హిందీలో డబుల్ ఇస్మార్ట్ వసూళ్లు చేయలేదంట. హిందీలో మొదటి రోజు ఈ సినిమాకి 45 లక్షల కలెక్షన్స్ వచ్చాయంట. ఓవరాల్ గా ఇప్పటి వరకు హిందీలో 1.08 కోట్లు మాత్రమే డబుల్ ఇస్మార్ట్ హిందీ బెల్ట్ లో కలెక్ట్ చేసింది.
అంటే సంజయ్ దత్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ లో కనీసం 8% కలెక్షన్స్ ని కూడా హిందీలో డబుల్ ఇస్మార్ట్ వసూళ్లు చేయలేకపోయింది. అంటే సంజయ్ దత్ క్రేజ్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఆయన ఉంటే హిందీ మార్కెట్ లో క్రేజ్ వస్తుంది అనుకున్నారు, కానీ కనీసం ఈ సినిమా రెండు కోట్ల కలెక్షన్స్ అందుకోలేకపోయింది. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా హిందీలో 21.3 కోట్ల నెట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. అంటే ఆ సినిమా ఎంతో కొంత హిందీ బెల్ట్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయిన కూడా లైగర్ పూరి జగన్నాథ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
డబుల్ ఇస్మార్ట్ హిందీ కలెక్షన్స్ అయితే లైగర్ మూవీ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. పూరి జగన్నాథ్ తన రెగ్యులర్ స్టోరీ టెంప్లెట్ నుంచి బయటకొచ్చి కొత్తదనం ఉన్న కథలతో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మూవీస్ చేస్తే కచ్చితంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. టెక్నీకల్ గా అలాగే క్యారెక్టరైజేషన్స్ పరంగా పూరి జగన్నాథ్ బ్రిలియన్స్ ని ఎవరూ అందుకోలేరని చెబుతున్నారు. మరి ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఎలా ఉంటుంది చూడాలి.