డబుల్ ఇస్మార్ట్న్ డే 1 బాక్సాఫీస్.. ఇది లెక్క
డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందే మ్యూజిక్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసింది.
డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందే మ్యూజిక్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. నిన్న గ్రాండ్ గా సినిమాను విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ లు నిర్మించారు. 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం, పండుగ వాతావరణంలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. మొత్తం ₹60 కోట్ల మేరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మేకింగ్ కోసమే దర్శకుడు పూరి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసుకున్న ఈ చిత్రం, 45% నుండి 50% వరకు ఆక్యుపెన్సీ సాధించింది. అయితే, కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, తొలిరోజు వసూళ్లలో రామ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
నైజాం: ₹2.49 కోట్లు
సీడెడ్: ₹90 లక్షలు
ఉత్తరాంధ్ర: ₹76 లక్షలు
తూర్పు గోదావరి: ₹44 లక్షలు
పశ్చిమ గోదావరి: ₹23 లక్షలు~
గుంటూరు: ₹70 లక్షలు~
కృష్ణా: ₹38 లక్షలు~
నెల్లూరు: ₹20 లక్షలు~
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ మొత్తం: ₹6.10 కోట్లు
కర్ణాటక + ROI: ₹65 లక్షలు
ఓవర్సీస్: ₹55 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు షేర్: ₹7.30 కోట్లు~ (₹12.45 కోట్లు గ్రాస్)
ఆగస్టు 15న చాలా పోటీ ఉన్న సమయంలోనే ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం అంటే మెచ్చుకోదగిన విషయం. రామ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే పూరి జగన్నాథ్ క్రేజ్ కూడా ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. మొదటి రోజు మాస్ సెంటర్లలో సినిమా మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక రెండవ రోజు కూడా ఇలానే కొనసాగితే సినిమాకు ఈ లాంగ్ వీకెండ్ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.