ఈ స్టార్ క్యూట్ పాపాయిని గుర్తు పట్టారా?
హిందీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా స్టార్స్ కి సూపర్ స్టార్స్ కి జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది.
పుట్టింది బెంగళూరు లో.. తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్.. తల్లి ట్రావెల్ ఏజెంట్.. ఈమె మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్. హిందీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా స్టార్స్ కి సూపర్ స్టార్స్ కి జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది.
పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ స్లో అవుతారు. కానీ ఈ అమ్మడు మాత్రం పెళ్లి తర్వాత అంతకు మించి అన్నట్లుగా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈమె కి ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ గా గుర్తింపు ఉంది.
ఇప్పటికే ఈ పాప ఎవరో గుర్తు పట్టి ఉంటారు. చిన్నప్పుడు చాలా క్యూట్ గా, చూడగానే వావ్ అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపించేంత అందంగా ఉన్న ఈమె మరెవ్వరో కాదు.. మీరు ఊహించినట్లుగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో ప్రభాస్ కి జోడీగా ప్రాజెక్ట్ కే 'కల్కి' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో ఈ అమ్మడి సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హిందీ సినిమాలతో పాటు ఈమె ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటిస్తూ హాలీవుడ్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.