డ్రాగన్, జాబిలమ్మ రెండూ ఓకే.. కానీ..

రెండు సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

Update: 2025-02-22 15:30 GMT

ఎప్పటిలాగే ఈ వారం పలు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమాతోపాటు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

అయితే రెండు సినిమాలు కూడా బాగున్నాయని నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. యూత్ ఎంటర్టైనర్ గా అశ్వత్ మారిముత్తు రూపొందించిన డ్రాగన్.. ఇంజనీరింగ్ లో సరిగ్గా చదవక, ప్రేమించిన అమ్మాయి దూరమయ్యాక, ఫేక్ సర్టిఫికెట్ తో జాబ్ సంపాదించుకుంటే ఏమవుతుందనే పాయింట్ చుట్టూ మూవీ తిరుగుతుందనే చెప్పాలి.

అలా యూత్ ను బాగా అట్రాక్ట్ చేశారు డ్రాగన్ మేకర్స్. మరోవైపు, ధనుష్ మరోసారి తన డైరెక్షన్ తో అలరించారు. స్టోరీ లైన్ రోటీన్ దే అయినప్పటికీ తమ సినిమాతో మెప్పించారు. ఫ్రెష్ కంటెంట్ అని సినీ ప్రియులతో అనిపించుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే.. ఏ విధంగా కూడా ఆడియన్స్ కు విసుగు రాకుండా చుసుకున్నారు.

అయితే రెండు సినిమాల కలెక్షన్లు చూసుకుంటే.. ప్రదీప్ రంగనాథన్ టాప్ లో నిలుస్తోంది. డ్రాగన్ 95% ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. జాబిలమ్మ 50% ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు సమాచారం. తమిళంలోపాటు తెలుగులో కూడా డ్రాగన్ దే ఆధిపత్యం కనిపిస్తున్నట్లు సమచారం. సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్నట్లు వినికిడి.

అదే సమయంలో ప్రమోషన్స్ కాస్త ఎక్కువ చేసి ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలు వసూళ్లను ఎక్కువగా రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రమోషన్స్ బాగుండు అని చెబుతున్నారు. రెండు చిత్రాలు బాగున్నా.. డ్రాగన్ కే ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.

నిజానికి.. చాలా చోట్ల సినిమాలు లేక థియేటర్స్ ను ఎగ్జిబిటర్స్ క్లోజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తండేల్ రన్ కాస్త స్లో అయిందనే చెప్పాలి. దీంతో అనేకచోట్ల థియేటర్స్ ను క్లోజ్ చేశారు. అందుకే జాబిలమ్మ, డ్రాగన్ మేకర్స్ ప్రమోషన్స్ ను జోష్ గా చేసి ఉంటే ఎక్కువ వసూళ్లు వచ్చేవని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు నార్మల్ కలెక్షన్స్ సాధిస్తున్నాయనే అంటున్నారు. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏ సినిమా టాప్ లో నిలుస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News