మరో 'దృశ్యం' వచ్చేస్తోంది.. వెంకీ గమనిస్తున్నాడా?
అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది.
దృశ్యం సిరీస్ చిత్రాలు ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం.. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అదే సమయంలో దృశ్యం మూవీ.. ఇతర భాషల్లో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే. అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం తెలుగు వెర్షన్ లో సీనియర్ హీరో హీరోయిన్లు విక్టరీ వెంకటేష్, మీనా ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
ఆ తర్వాత దృశ్యం -2 వచ్చి కూడా మంచి హిట్ గా నిలిచింది. కరోనా వల్ల ఓటీటీలో రిలీజ్ అయింది. మోహన్ లాల్ యాక్టింగ్ తోపాటు జీతూ జోసెఫ్ మేకింగ్ కు ప్రశంసలు లభించాయి. తెలుగులో కూడా ఓటీటీలో రిలీజ్ అయిన దృశ్యం సెకండ్ పార్ట్ అందరినీ ఆకట్టుకుంది. జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించారు.
అయితే దృశ్యం 3 ఉంటుందని ఇప్పటికే అనేకసార్లు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మరో మూడు నాలుగేళ్లలో సినిమా వస్తుందని తెలిపారు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు తెలుస్తోంది. మోహన్ లాల్.. తాజాగా గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం 3 కన్ఫర్మ్ అని పోస్ట్ చేశారు. దాంతోపాటు ఓ క్రేజీ పిక్ ను షేర్ చేశారు.
అందులో దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్ తో మోహన్ లాల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరో సూపర్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో వెంకీ గమనిస్తున్నారా అని తెలుగు సినీ ప్రియులు అని క్వశ్చన్ చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాల తెలుగు వెర్షన్ తొలి రెండు భాగాల్లో ఆయనే నటించారు. ఇప్పుడు మూడో భాగానికి రెడీ అవ్వండని కామెంట్లు పెడుతున్నారు. అయితే రీసెంట్ గా వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ పై దృష్టి పెట్టారు. అనిల్ రావిపూడితో మరిన్ని సినిమాలు చేయనున్నట్లు తెలిపారు. మరి దృశ్యం 3 మాతృక ఎప్పుడు వస్తుందో.. తెలుగులో వెంకీ ఎప్పుడు రీమేక్ చేస్తారో వేచి చూడాలి.