ముంబైను ఊపేసి సియోల్‌కి ప‌య‌న‌మైన వైర‌స్

గత రాత్రి ముంబై కచేరీలో డ్యుయా లిపా ఎంపిక చేసుకున్న మేక‌ప్, డ్రెస్ సెన్స్, డ్యాన్సుల గురించి యువ‌త‌రంలో ఒక‌టే చ‌ర్చ సాగుతోంది.

Update: 2024-12-01 12:49 GMT

గ్లోబల్ పాప్ సెన్సేషన్ డ్యుయా లిపా ముంబైని అట్టుడికించింది. అదిరిపోయే గానం.. ఉర్రూత‌లూగించే నృత్యాల‌తో డ్యుయా లిపా యూత్ ని హీటెక్కించింది. ఇంగ్లీష్ గాయని తన పవర్‌హౌస్ గాత్రంతో హృదయాలను గెలుచుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని MMRDA గ్రౌండ్స్‌లో నవంబర్ 30న జొమాటో ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్‌లో ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన పాప్ గాయ‌ని డ్యుయా లిపా బోల్డ్ వైట్ లుక్ చ‌ర్చ‌గా మారింది. వేదిక‌పై మిరుమిట్లు గొలిపే డిజైన‌ర్ దుస్తుల్లో డ్యుయా లిపా హెడ్ ట‌ర్నర్ గా మారింది.

 

గత రాత్రి ముంబై కచేరీలో డ్యుయా లిపా ఎంపిక చేసుకున్న మేక‌ప్, డ్రెస్ సెన్స్, డ్యాన్సుల గురించి యువ‌త‌రంలో ఒక‌టే చ‌ర్చ సాగుతోంది. మెరిసే తెల్లటి మోనోకినిలో ఈ గాయ‌ని ధ‌గ‌ధ‌గ‌లాడిపోయింది. డ్యుయా లిపా రెట్రో ఆకర్షణను పెంచేలా తెల్లటి మోకాలి బూట్‌లతో క‌నిపించింది. వజ్రాలు పొదిగిన చెవిపోగులు, సొగసైన చోకర్ నెక్లెస్ తో మ్యాడ్ నెస్ పెంచింది.

ఈ నైట్ షో కోసం హైద‌రాబాద్ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు అటెండ‌యిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని, న‌మ్ర‌త శిరోద్క‌ర్, వంశీ పైడిప‌ల్లి కుమార్తె ఆద్య‌, సుకుమార్ ఈ వేడుక‌కు అటెండ‌య్యారు. ఇక వేదిక వ‌ద్ద డ్యుయా లిపాతో సితార‌- న‌మ్ర‌త ఫోటోలు దిగ‌గా అవి ఇప్ప‌టికే వైర‌ల్ గా మారాయి. ఇక వేదిక‌ను ఉర్రూత‌లూగించిన డ్యుయా కింగ్ ఖాన్ షారూక్ పాట‌ల‌కు కూడా స్టెప్పులు వేసింది.

సియోల్ కి ప‌య‌నం:

ముంబయిని ఆశ్చర్యపరిచిన అద్భుతమైన ప్రదర్శన తర్వాత డ్యుయా లిపా ఇప్పుడు చివ‌రి స్టాప్ సియోల్‌కు వెళుతోంది. ఆమె రాడికల్ ఆప్టిమిజం టూర్ ఆసియా లెగ్ చివరి స్టాప్ లో ప్ర‌ద‌ర్శ‌న‌ను ముగించాల్సి ఉంది. గ్రామీ-విజేత, పాప్ స్టార్ ముంబైలో తన హిట్ పాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఊహించని విధంగా ముంబై వేదిక‌పై లెవిటేటింగ్ - వో లడ్కీ జో (షారూఖ్ ఖాన్ బాద్షా నుండి) పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌డం ఒక హైలైట్. ఈ డ్యాన్స్ వీడియో వేగంగా వైరల్ అయింది. కచేరీ తరువాత, దువా ఇప్పుడు దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళుతోంది. దువా లిపా ముంబైలో గడిపినప్ప‌టి కొన్ని చిరస్మరణీయ ఫోటోలను షేర్ చేస్తూ ముంబైకి వీడ్కోలు పలికింది.

థాంక్యూ ముంబయి!!!!! ఆసియా రన్ మా తదుపరి చివరి స్టాప్‌కి బయలుదేరాను... సియోల్!!!!! అని డ్యుయా వెల్ల‌డించింది. ముంబైలో ఆమె ప్రదర్శనతో థ్రిల్ అయిన అభిమానులు వ్యాఖ్యల‌ విభాగంలో వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. షో వాజ్ జస్ట్ వావ్వ్ అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. ఈ కచేరీకి రాధిక మర్చంట్, ఆనంద్ పిరమల్, రణవీర్ షోరే త‌దిత‌రులు హాజరయ్యారు.

Tags:    

Similar News