దుల్కర్, రానా.. నెవ్వర్ బిఫోర్ కాంబో..
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషలలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషలలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మలయాళంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న దుల్కర్ కి తెలుగులో సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ వచ్చింది. ఈ మూవీ తర్వాత తెలుగులో కూడా దుల్కర్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ దుల్కర్ నుంచి లక్కీ భాస్కర్ మూవీ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతోంది.
ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత అనే కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం తాజాగా జరిగింది. కాంత మూవీ కూడా మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతోంది. దుల్కర్ తరహాలోనే టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి వివిధ భాషలలో సినిమాలు చేస్తున్నారు. అయితే మెయిన్ యాక్టర్ గా కాకుండా సెకండ్ లీడ్, విలన్ క్యారెక్టర్స్ కూడా ఒప్పుకుంటున్నారు. కథ నచ్చి, తన పాత్రకి ప్రాధాన్యత ఉంది అనుకుంటే ఏ భాషలో అయినా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
కాంతలో రానా దగ్గుబాటి ఒక హీరోగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా భాగమయ్యాడు. మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా బ్యానర్ పై రానా నిర్మిస్తున్నారంట. దుల్కర్ సల్మాన్ సొంత ప్రొడక్షన్ అయిన వేఫరెర్ ఫిలిమ్స్ కూడా కాంత సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండబోతోంది. సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. అంటే ఇద్దరు స్టార్స్ కాంత చిత్రంలో కలిసి నటించడమే కాకుండా నిర్మిస్తున్నారని అర్ధమవుతోంది.
1950లో మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో కాంత చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించబోతున్నాడంట. అంటే పీరియాడిక్ జోనర్ లోనే ఈ సినిమా కథాంశం మొత్తం ఉండబోతోందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రారంభోత్సవంలో భాగ్యశ్రీ కూడా పాల్గొంది. అలాగే సముద్రఖని కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఇద్దరు హీరోలు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందంట. దుల్కర్, రానా ఇద్దరు కూడా కథల ఎంపికలో కొత్తదనం చూస్తారు. అలాంటి వీరిద్దరూ కలిసి కాంత చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంటే కచ్చితంగా ఈ మూవీలో ఏదో కొత్త పాయింట్ ని సెల్వమణి సెల్వరాజ్ చెప్పబోతున్నారని సినీ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అదేంటి అనేది త్వరలో తెలిసే అవకాశం ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.