రెండేళ్ల‌ తర్వాత మాలీవుడ్‌కి తిరిగి వెళ్లిన హీరో

దుల్కర్ స‌ల్మాన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఓకే బంగారం, మ‌హాన‌టి, సీతారామం, ల‌క్కీ భాస్క‌ర్ స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో దుల్క‌ర్ న‌టించాడు.;

Update: 2025-03-03 04:08 GMT

దుల్కర్ స‌ల్మాన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఓకే బంగారం, మ‌హాన‌టి, సీతారామం, ల‌క్కీ భాస్క‌ర్ స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో దుల్క‌ర్ న‌టించాడు. ఇవ‌న్నీ మాలీవుడ్ తో సంబంధం లేని ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లతో అనుసంధాన‌మై చేసిన చిత్రాలు. ఇవ‌న్నీ మ‌ల‌యాళ వెర్ష‌న్లు విడుద‌లై విజ‌యం సాధించాయి. పాన్ ఇండియాలో దుల్క‌ర్ కి ఇప్పుడు అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.


అయితే దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత దుల్క‌ర్ త‌న మాతృప‌రిశ్రమ అయిన మలయాళ సినీప‌రిశ్ర‌మ‌కు తిరిగి వెళ్లాడు. అత‌డు ఈ రెండేళ్ల కాలంలో ఎక్కువ‌గా హైద‌రాబాద్, చెన్నై న‌గ‌రాల‌తో క‌నెక్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు గ్యాప్ తర్వాత, దుల్కర్ సల్మాన్ నహాస్ హిదాయత్ రూపొందించ‌నున్న `ఐయామ్ గేమ్`తో మలయాళ సినీప‌రిశ్ర‌మ‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. శనివారం ఈ మూవీ టైటిల్‌ను ఆవిష్కరించారు. రెండు చేతులు బిగించి ప‌ట్టుకున్నాడు. ఒక చేతిలో క్రికెట్ బాల్ ఉంది. మ‌రో చేతిలో మండుతున్న‌ ప్లేయింగ్ కార్డ్ క‌నిపిస్తోంది.

మాలీవుడ్ లో RDX బ్లాక్‌బస్టర్ విజయం సాధించాక న‌హాస్ త‌న రెండో ప్ర‌య‌త్నంగా `ఐయామ్ గేమ్` అనే సినిమాని రూపొందిస్తున్నాడు. దర్శకుడు స్వయంగా కథను రాశారు. సాజీర్ బాబా, బిలాల్ మొయిదు- ఇస్మాయిల్ అబూబకర్ స్క్రీన్ ప్లే అందించారు. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్ర‌ఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ ప‌తాకంపై దుల్కర్ - జోమ్ వర్గీస్ నిర్మించారు. ఐయామ్ గేమ్ మలయాళం, తమిళం, తెలుగు, హిందీ , కన్నడ సహా పలు భాషలలో విడుదల కానుంది. దుల్కర్ ఇటీవలే `లక్కీ భాస్కర్` అనే హిట్ చిత్రంలో నటించారు. ఇది 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది.

ప్ర‌తిభావంతుడైన దుల్కర్ సల్మాన్ త‌దుప‌రి వ‌రుస చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో రెండు ఇతర మలయాళ చిత్రాలు ఉన్నాయి. ఒకటి పరవ మేక‌ర్ సౌబిన్ షాహిర్ తో, మరొకటి నూతన దర్శకుడితో చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ తమిళ పీరియాడికల్ డ్రామా కాంత, పవన్ సాదినేని తెలుగు చిత్రం `ఆకాశంలో ఒక తార`లో కూడా న‌టించాల్సి ఉంది. ఐ యామ్ గేమ్ తో దుల్కర్ మలయాళ సినీప‌రిశ్ర‌మ‌లోకి బ‌లంగా రీఎంట్రీ ఇస్తున్నాడు.

`ఐయామ్ గేమ్` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మలయాళ సినీప‌రిశ్ర‌మ‌కు తిరిగి రావడం ఆస‌క్తిని పెంచుతోంది. భారీ తారాగ‌ణం, టాప్ టెక్నీషియన్స్ తో దుల్క‌ర్ ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News