తెలుగు సినిమా.. నాన్న చెప్పిన మాట..!

తెలుగులో వస్తున్న కథలు తనకు బాగా కనెక్ట్ అవుతున్నాయని అందుకే ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నానని అన్నారు.

Update: 2024-11-05 05:02 GMT

తెలుగులో యువ హీరోలతో సమానంగా మలయాళ హీరో వరుస సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. అతనే మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. మహానటితో మెప్పించి సీతారామం తో అలరించి ఈమధ్యనే లక్కీ భాస్కర్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా చూస్తే సినిమాలో నటించింది మనకు తెలిసిన దుల్కర్ సల్మానేనా అనిపించేలా అతని నటన ఉంది. కథాబలం ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు దుల్కర్.

ఈ క్రమంలో లక్కీ భాస్కర్ సక్సెస్ జోష్ లో మీడియాతో ముచ్చటించారు దుల్కర్. తెలుగులో వస్తున్న కథలు తనకు బాగా కనెక్ట్ అవుతున్నాయని అందుకే ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నానని అన్నారు. మాది మధ్యతరగతి ఫ్యామిలీనే నాన్న పెద్ద స్టార్ అయినా ఆయన తోడపుట్టిన వారు ఐదుగురు మధ్యతరగతి వారే.. అమ్మ తరపున వారు ముగ్గురు కూడా అంతే. అందుకే లక్కీ భాస్కర్ లో ఈ అంశాలన్నీ నటించేందుకు సహకరించాయని అన్నారు దుల్కర్.

ఇక నాన్న స్వాతికిరణం చేసిన టైం లో తెలుగు భాషలో భావ వ్యక్తీకరణ గురించి చెప్పారు. ఆ సినిమా చేశాక ఇంట్లో తెలుగు సినిమాలు చూసేవారు. అందుకే తెలుగు వచ్చాకే తెలుగులో నటించాలని అనుకున్నా అయితే మహానటి టైం లో నాగ్ అశ్విన్ ప్రోత్సాహం వల్ల నటించా. ఇప్పుడు తెలుగులో చాలా సౌకర్యంగా ఉందని అన్నారు దుల్కర్ సల్మాన్. తన తదుపరి సినిమా ఆకాశంలో ఒక తార సినిమా వస్తుందని ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని అన్నారు.

మమ్ముట్టి తనయుడిగా కాదు తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునేందుకు దుల్కర్ సల్మాన్ ప్రయత్నిస్తున్నాడు. తను ఎంచుకున్న కథల్లో తను తప్ప మరొకరు కనిపించరు అన్నట్టుగా అతని నటన ఉంటుంది. అదీగాక తెలుగులో దుల్కర్ సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి ఆ సినిమాలు మ్యాజిక్ లు చేస్తున్నాయి. మొత్తానికి దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమా సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.

కథను నమ్మే ప్రతి హీరోకి సక్సెస్ కచ్చితంగా వస్తుందని చెప్పడానికి దుల్కర్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. అతను చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలని దుల్కర్ చేసే హోం వర్క్ చూసి కూడా అతనికి అభిమానులుగా మారుతున్నారు.

Tags:    

Similar News