కిరణ్ అబ్బవరం 'క'.. రంగంలోకి బిగ్ స్టార్

యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం "KA" ఇప్పటికే మంచి అంచనాలను సొంతం చేసుకుంది.

Update: 2024-09-09 08:12 GMT

యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం "KA" ఇప్పటికే మంచి అంచనాలను సొంతం చేసుకుంది. పీరియడ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్, మొదటి పాటతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండటంతో సినిమా పై ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ చిత్రం టీజర్ మరియు ఒక్క పాట విడుదలైనప్పటికీ, 'క' పై ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, నిర్మాతల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. దీనికి కారణం సినిమా కంటెంట్ కు ఉన్న విశ్వసనీయత. నిర్మాత వంశి నందిపాటి ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను మంచి ధరకు సొంతం చేసుకోవడంతో, ఇతర భాషల్లో కూడా హక్కులు కొనుగోలు చేసే పోటీ ప్రారంభమైంది.

ఈరోజు ఒక కీలక అప్‌డేట్ తో చిత్రం మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వే ఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది మలయాళ మార్కెట్ లో KA కి బలమైన పునాది అందిస్తుంది.

కంటెంట్ పరంగా సక్సెస్ అవడానికి మంచి అవకాశాలు ఉన్న 'క' చిత్రం, పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్నీ భాషల్లో కూడా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

"క" చిత్రంలో నయన్ సరికా మరియు తన్వి రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి సుజిత్ మరియు సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం లో సాగే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్ ను అందించనుంది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతోంది.

Tags:    

Similar News