ఆమె రజనీకాంత్‌ను 'ఒరేయ్' అందా..!
అయితే నటి దుషారా విజయన్ సోషల్ మీడియా ద్వారా చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, రాజకీయాలకు చెందిన వారు, ఇతర రంగాలకు చెందిన వారు సైతం పెద్ద ఎత్తున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడులో మాత్రమే కాకుండా రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అభిమానులు ఉంటారు. ఇతర రాష్ట్రాల్లోనూ రజనీకాంత్‌ను అభిమానించే వారు ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు.
రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నటి దుషారా విజయన్ సోషల్ మీడియా ద్వారా చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె ఒరేయ్ తలైవర్ అంటూ పోస్ట్ చేయడం తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. రజనీకాంత్‌ను ఒరేయ్ అంటూ సంభోధిస్తావా అంటూ కొందరు తెలుగు అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమె తప్పు ఏమీ లేదు, తెలుగు వారు ఆమెను అపార్ధం చేసుకున్నారు. ఆమె గౌరవం తగ్గించి రజనీకాంత్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు అనేది వాస్తవం.
తమిళంలో ఒరేయ్ అంటే ఒక్కరే అని అర్థం వస్తుంది. సూపర్ స్టార్ ఒక్కరే అనే అర్థం వచ్చే విధంగ ఆ రజనీ కాంత్ పై తన అభిమానంను దుషారా చూపించారు. అంతే తప్ప ఆయన్ను అవమానించే విధంగా ఒరేయ్ పదంను వాడలేదు అంటూ కొందరు తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సర్దుమనిగింది. దుషారా గతంలో రజనీకాంత్ సినిమాలో నటించింది. ఆయనతో వర్క్ ఎక్క్‌పీరియన్స్ అద్భుతం అని, ఆయన ఒక గొప్ప వ్యక్తి అంటూ గతంలోనూ ప్రశంసలు కురిపిస్తూ రజనీకాంత్‌ను సూపర్ స్టార్ ఒక్కరే అది రజనీకాంత్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.
ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దుషారా విజయన్‌కి 2019లో బోదై ఏరి బుద్ది మారి సినిమాతో పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన సార్పట్ట పరంపర సినిమాలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కింది. రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా ఈమెకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. తెలుగు నుంచి ఈమెకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ముందు ముందు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో నటించడం కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.