1000 కోట్ల లావాదేవీలపై నిర్మాతపై ED ప్రశ్నలు
మలయాళ చిత్రం `L2: ఎంపురాన్` నిర్మాత గోకులం గోపాలన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం వరుసగా రెండో రోజు కూడా ప్రశ్నించనుంది.;

మలయాళ చిత్రం `L2: ఎంపురాన్` నిర్మాత గోకులం గోపాలన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం వరుసగా రెండో రోజు కూడా ప్రశ్నించనుంది. గోపాలన్ అతడి వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం ఉన్న పలు చోట్ల ఏప్రిల్ 4న ఈడీ దాడులు ప్రారంభించింది. వీటిలో చెన్నైలోని కోడంబాక్కంలోని గోకులం చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ ప్రధాన కార్యాలయం, నీలంకరైలోని గోపాలన్ నివాసం, కోయంబత్తూర్, కేరళలోని కోజికోడ్‌లోని అదనపు ప్రాంగణాలు ఉన్నాయి.
ఆ సమయంలో కోజికోడ్‌లో ఉన్న గోపాలన్‌ను విచారణ కోసం చెన్నైకి పిలిపించారు. శనివారం తెల్లవారుజామున ఆయన చెన్నై కార్యాలయంలో విచారించారు. ఈరోజు తదుపరి విచారణ జరగనుందని ఈడీ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు `ఎల్ 2 ఎంపురాన్` సినీ నిర్మాణంతో ముడిపడి ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రమేయం ఉండటంతో రైటిస్టు గ్రూపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈడీ -కొచ్చి యూనిట్ అలాగే, చెన్నై యూనిట్ నుండి మద్దతుతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
కొంతమంది ఎన్నారైలతో లావాదేవీలు, అనధికార ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం ఉన్న రూ. 1000 కోట్ల విలువైన విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో ఉల్లంఘనలకు సంబంధించి గోకులం కంపెనీపై మోసం చేసినట్లు వచ్చిన అనేక ఫిర్యాదులను కూడా ఏజెన్సీ సమీక్షిస్తున్నట్లు సమాచారం. గోపాలన్ నాయకత్వంలోని గోకులం గ్రూప్ చిట్ ఫండ్‌లు, ఫైనాన్స్, ఫిల్మ్ ప్రొడక్షన్, క్రీడలలో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ 2023 నుండి ఈడీ స్కానర్‌ల ఉంది. దీనికి ముందు గోపాలన్ అనేకసార్లు అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. సీపీఐ(ఎం) కేరళ నాయకుడు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ టిపి రామకృష్ణన్ ఈ దాడులు రాజకీయంగా ప్రేరేపించినవని ఆరోపించారు.
నటుడు- దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్ 2 చిత్రం మార్చి 28న విడుదలైంది. భారీ ఓపెనింగులు సాధించినా ఇంతలోనే వివాదంలో చిక్కుకుంది.