సంచలన బ్యూటీకి అక్కడైనా కలిసొచ్చేనా?
కంగనా రనౌత్ స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `ఎమర్జెన్సీ` భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
థియేట్రికల్ రిలీజ్ లో ఫెయిలైన సినిమాలు కొన్ని ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా అత్యధికంగా వీక్షించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలో `ఎమర్జెన్సీ` నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి. కంగనా రనౌత్ స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `ఎమర్జెన్సీ` భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
జనవరి 17న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓపెనింగ్స్ భారీ ఎత్తున దక్కాయి. సినిమాకి మంచి రివ్యూలు కూడా వచ్చాయి. కానీ సినిమా మాత్రం ఆశించిన ఫలితం సాధించలేదు. దీంతో థియేట్రికల్ రిలీజ్ లో సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది. ఎన్నో వివాదాలు దాటుకుని రిలీజ్ అయినా? ఫలితం తీవ్ర నిరాశనే మిగిల్చింది. రిలీజ్ కోసం కంగన పెద్ద యుద్దమే చేసింది. చివరికి ఎలాగూ రిలీజ్ అయింది అనుకుంటే? కంగన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
ఈ నేపథ్యంలో సినిమా మార్చి 17న ఓటీటీలో రిలీజ్ అవుతుంది. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. కంగన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ కొత్త ప్రయత్నం చేసిందని జాతీయ మీడియా కథనాల్లో ప్రశంస కనిపించింది. ఇలాంటి పాజిటివ్ టాక్ ఓటీటీ రిలీజ్ కి కలిసొస్తుందని కంగన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
థియేట్రికల్ రిలీజ్ అయిన చాలా సినిమాలు ఓటీటీ బుల్లి తెర ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రాలు చాలా ఉన్నాయి. నిర్మాతలు అక్కడ కాస్త లాభపడ్డారు. మరి ఇలాంటి అదృష్టం కంగనకు `ఎమెర్జన్సీ` రూపంలో కలిసొస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం కంగన సైకో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తమిళ్, హిందీలో ఓ సినిమా చేస్తోంది.