ఓజీ విల‌న్‌తో స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌యోగం

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ చిత్రం ఓజీలో ఇమ్రాన్ హ‌ష్మి విల‌న్ గా న‌టిస్తున్నాడు.

Update: 2024-10-04 20:30 GMT

టాలీవుడ్ లో విల‌న్ గా న‌టిస్తున్నాడు ఇమ్రాన్ హ‌ష్మి. సీరియ‌ల్ కిస్స‌ర్ గా సుప‌రిచితుడైన ఇమ్రాన్ ఇటీవ‌ల సౌత్ లో త‌న ల‌క్ చెక్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియ‌న్ చిత్రాల వెల్లువ‌లో అత‌డికి ఇక్క‌డ ఆఫ‌ర్లు వ‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ చిత్రం ఓజీలో ఇమ్రాన్ హ‌ష్మి విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఓజీపై అత‌డు చాలా హోప్స్ పెట్టుకున్నాడు.


ఇంత‌లోనే ఇప్పుడు మాతృభాష‌లో క్రేజీ డైరెక్ట‌ర్ తో ఇమ్రాన్ హ‌ష్మి అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. A వెడ్నెస్ డే, స్పెషల్ 26, ఎంఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన నీర‌జ్ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కూ రొమాంటిక్ పాత్ర‌లు, మాస్ పాత్ర‌లు చేసాడు. కానీ ఈసారి అందుకు భిన్న‌మైన అవ‌కాశాన్ని అందుకోబోతున్నాడ‌ని తెలిసింది.

నీరజ్ పాండే ఇటీవల స్పెషల్ ఆప్స్‌తో ఓటీటీ రంగంలో విజయాన్ని సాధించాడు. షో సీజన్ 2ని పూర్తి చేస్తున్నాడు. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. త‌దుప‌రి నెట్‌ఫ్లిక్స్‌లో సికందర్ కా ముఖద్దర్ ప్రత్యక్ష OTT విడుదలను ప్లాన్ చేస్తున్నాడు. ఖాకీ, ది ఫ్రీలాన్సర్ వంటి సిరీస్ ల‌తోను విజ‌యాలు అందుకున్న నీర‌జ్ ఇప్పుడు ఇమ్రాన్ కి స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ ని అందిస్తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News