మెగా కాంపౌండ్ లో హష్మీ మరో సినిమానా!
ఇదులో పవన్ ఢీ కొట్టే మాఫియా డాన్ పాత్రలో నటి స్తున్నాడు.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పవర స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'ఓజీ'తో హష్మీ లాంచ్ అవుతున్నాడు. ఇదులో పవన్ ఢీ కొట్టే మాఫియా డాన్ పాత్రలో నటి స్తున్నాడు. ఇమ్రాన్ పాత్ర ని హీరోకి ధీటుగా దర్శకుడు సుజిత్ మలుస్తున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ పుల్ డాన్ పాత్రలో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమా తర్వాత ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ లో బిజీ విలన్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే 'గుఢచారి-2'లో కూడా ఛాన్స్ అందుకున్నాడు. అడవి శేషు కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఇమ్రాన్ హష్మీ శేషుని ఢీ కొడుతున్నాడు. అలా 'ఓజీ',' జీ-2'లో ఇమ్రాన్ బలమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించనున్నాడు.
ప్రస్తుతం రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్ లో మరో ఛాన్స్ అందు కున్నట్లు వినిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. గాంధీ మార్క్ యాక్షన్ కామెడీ చిత్రమిది. ఇందులో ఇమ్రాన్ హష్మీని ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు ఒక్కొకరుగా సౌత్ ఇండస్ట్రీ వైపు టర్న్ అవుతోన్న సంగతి తెలిసిందే. 'యానిమల్' విజయం తర్వాత బాబి డియోల్ తెలుగు సినిమాలకు అదే పనిగా కమిట్ అవుతున్నాడు. 'డాకు మహారాజ్', 'హరిహర వీరమల్లు', దలపతి 69 చిత్రాల్లో నటిస్తున్నాడు. 'సైంధవ్' సినిమాతో నవాజుద్దీన్ సిద్దీఖీ కూడా టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.