ఫోటో స్టోరి: ఈషా గుప్తా కిల్లర్ అవతార్ వైర‌ల్

ఈ భామ లేటెస్టుగా స్ట‌న్నింగ్ అవతార్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Update: 2024-10-28 05:22 GMT

ఫ్యాష‌నిస్టా ఈషా గుప్తా తాజా ఫోటోషూట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ లేటెస్టుగా స్ట‌న్నింగ్ అవతార్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కిల్లర్ లుక్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచ‌డం ఈ భామ‌కు కొత్తేమీ కాదు కానీ, ఈసారి ఫోటోగ్రాఫ్ కొన్ని కార‌ణాల‌తో విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.


బాలీవుడ్ న‌టి కం మోడ‌ల్ ఈషా గుప్తా తనదైన‌ స్టైల్, గ్లామర్ ని ఎలివేట్ చేసినా కానీ ఇది ఒక హోట‌ల్ ప్ర‌చారం కోసం చేసిన ఫోటోషూట్ కావ‌డంతో కొన్ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్ లోని ఆకాశ‌హార్మ్యాల న‌డుమ ఒక హోట‌ల్ ప్ర‌మోష‌న్ కోసం ఇషాజీ ఇచ్చిన ఫోజ్ వెబ్ లో కొంద‌రిని ఆక‌ట్టుకోలేదు. వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించిన ఇషా లైట్ మేకప్ ఓపెన్ హెయిర్ తో క‌నిపించింది. దూరంగా ప్ర‌యివేట్ హోట‌ల్ పేరు ఈ ఫోటోగ్రాఫ్ లో హైలైట్ గా క‌నిపిస్తోంది.


నిజానికి ఇషా లుక్ .. స్టైలిష్ పోజులను కుర్ర‌కారు మెచ్చుకున్నా, మ‌రీ ఈ రేంజులో హోట‌ల్ కి ప్ర‌మోష‌న్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అస‌లు ఆ హోటల్ లాంచింగ్ కి ఈ ఫోజ్ కి సంబంధం ఏమైనా ఉందా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. టూమచ్ గా ఎక్స్ పోజ్ చేసిందంటూ త‌న‌ను కొంద‌రు వేలెత్తి చూపారు.


ఇషా తన లుక్స్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. టాప్ మోడ‌ల్ ఇషా ప్రతి ఫోటో ఏదో ఒక కార‌ణంతో ఇంటర్నెట్‌లో చ‌ర్చ‌గా మారుతుంది. ఈసారి కూడా ఆమె అవతార్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. దానిపై చాలా చ‌ర్చ సాగింది. ఇషా గుప్తా ఫెమినా మిస్ ఇండియా జ‌డ్జిగాను సుప‌రిచితం. రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఒక ఐట‌మ్ నంబ‌ర్ లోను న‌ర్తించి తెలుగు వారికి సుప‌రిచిత‌మైంది. కానీ తెలుగులో ఈ భామ‌కు న‌టిగా అవ‌కాశాలు రాలేదు. హిందీ చిత్ర‌సీమ‌లో హౌస్ ఫుల్ 5 స‌హా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో న‌టిస్తోంది.

Tags:    

Similar News