పీరియడ్స్ గురించి ఆ డైరెక్టర్ కి చెప్పిన ఈషా!
తాజాగా ఈషా ముందుకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వెళ్లింది. ఆన్ సెట్స్ లో ఉండగా పీరియడ్స్ లాంటి సమస్యని ఎలా అధిగమిస్తారు?
తెలుగమ్మాయి ఈషారెబ్బా కెరీర్ జర్నీ ఎలా ఉందో తెలిసిందే. 'అంతకు ముందు ఆ తర్వాత' నుంచి 'మామ మశ్చింద్ర' వరకూ చాలా సినిమాలు చేసింది. వాటిలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలు..కీలక పాత్రలు పోషించి నటిగా ఓ ఐడెంటిటీని దక్కించుకుంది. 'అరవింద సమేత వీరరాఘవ' తో మరింత ఫేమస్ అయింది. అలాగే కోలీవుడ్ లోనూ మూడు ,నాలుగు సినిమాలు చేసింది. మాలీవుడ్ లోనూ పనిచేసిన అనుభవం ఉంది.
తాజాగా ఈషా ముందుకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వెళ్లింది. ఆన్ సెట్స్ లో ఉండగా పీరియడ్స్ లాంటి సమస్యని ఎలా అధిగమిస్తారు? అని ప్రశ్నించగా.. ' పీరియాడ్స్ వచ్చాయని ఆరోజు సెలవు తీసుకోవడానికి ఉండదు. సమయం అక్కడ డబ్బుతో ముడి పడి ఉంటుంది. ఒక గంట వృద్ధా చేసినా నిర్మాతకి నష్టమే. సినిమా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. రిస్క్ తీసుకునేది కాదు. ముందుగానే పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకుంటాను. నా మొదటి సినిమా చేసినప్పుడు ఆ రోజు కీలక మైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.
అప్పుడే నాకు పిరియడ్స్ సమస్య వచ్చింది. ఆ విషయం వెంటనే మోహన్ గారికి చెప్పాను. ఆయన నా పరిస్థితిని అర్దం చేసుకున్నారు. వెంటనే బ్రేక్ తీసుకో అని అన్నారు. అలాగని నేనేమీ ఓపూట మొత్తం విశ్రాంతి తీసుకోలేదు. కొంత మంది దర్శకులు అలా అర్దం చేసుకోగలరు. ప్రీనెస్ అనేది అందరితో ఉండకపోవచ్చు. అమ్మాయిలకు అక్కడ వైబ్ తెలుస్తుంది. మన సమస్య చెబితే అర్దం చేసుకుంటారంటే? ధైర్యంగా చెప్పొచ్చు.
కాలేజీ రోజుల్లో ఈ సమస్య గురించి చెప్పలేకపోయేదాన్ని. ఎందుకంటే ఇది ఎవరికీ చెప్పకూడదని నూరిపోస్తారు. అబ్బాయిలకు అస్సలు తెలియకూడని విషయంగా చెబుతారు. తొలుత మోహన్ కృష్ణగారికి కూడా ముందుగా చెప్పలేదు. నా ఇబ్బందిని ఆయనే గుర్తించి ఆర్ యూ..కంపర్ట్ బుల్ గా ఉన్నావా? అని అర్ధం చేసుకుని అడిగిన తర్వాత చెప్పాను. ఆయన అలా చెప్పగానే ఇదేమి పెద్ద చెప్పకూడని సమస్య కాదనిపించింది.
దీని గురించి మాట్లాడొచ్చుని అప్పుడే అర్దమైంది. చిన్నప్పటి నుంచి ఈ విషయం ఎవరికీ చెప్పం కాబట్టి అలా మైండ్ నెగిటివ్ గా ఉండిపోతుంది. కానీ మన సమస్యని చెప్పుకోవడంలో తప్పులేదు. ఆ తర్వాత దీనిపై అవేర్ నేస్ కార్యక్రమాలు కూడా చేసాను. బిగ్ బాస్ లో కూడా చుట్టూ ఉన్న వారితో ప్రీ గా ఉండాలి అని చెప్పేదాన్ని' అని అన్నారు.