సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు అందరి ఫోకస్ దానిపైనే..
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్.. సంక్రాంతి వస్తున్నాం మూవీతో సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్.. సంక్రాంతి వస్తున్నాం మూవీతో సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.
ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్ అవ్వడంతో.. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే మేకర్స్ సందడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తో మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. చాలా వెరైటీగా.. నెవ్వర్ బిఫోర్ అనేలా సందడి చేస్తున్నారు. వివిధ ప్రమోషనల్ వీడియోస్ తో అందరి దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్ ను రిలీజ్ చేయగా.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అంతే కాదు మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి.
దీంతో ఇప్పుడు అంతా థియేట్రికల్ ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ట్రైలర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఎలా ఉంటుందో.. వెంకీ తన అభిమానులను ఎలా అలరిస్తారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ పై అందరి ఫోకస్ ఉందన్నమాట. అయితే రేపు (జనవరి 6) ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ కానుంది. 72 రోజుల్లో షూటింగ్ ను పూర్తయిందని రీసెంట్ గా అనిల్ రావిపూడి చెప్పి షాకిచ్చారు. మూవీని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తీశామని.. క్వాలిటీ విషయంలో కూడా అస్సలు రాజీ పడలేదని తెలిపారు. మరి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.