ఆమె నా జీవితంలోకి వచ్చాక అంతా మారింది

తన భార్య లిన్ లైస్రామ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.

Update: 2024-02-14 12:56 GMT

బాలీవుడ్ స్టార్ నటుడు రణదీప్ హుడా ఇటీవలే వైవాహిక జీవితం మొదలు పెట్టాడు. 47 ఏళ్ల వయసులో కొత్తగా సంసార జీవితాన్ని ప్రారంభించిన రణదీప్ ప్రేమికుల రోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య లిన్ లైస్రామ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.


లిన్ లైస్రామ్‌ ను వివాహం చేసుకున్న తర్వాత రణదీప్ హుడా జీవితంలో అనూహ్య మార్పులు వచ్చినట్టు పేర్కొన్నాడు. అంతే కాకుండా తన జీవితంలో సీరియస్‌నెస్ వచ్చిందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గతంలో తాను సినిమాల్లో నటించేవాడిని, కానీ నటన పట్ల సీరియస్ గా ఉండేవాడిని కాదు. వృత్తితో పాటు ఫ్యామిలీని కూడా గతంలో పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. కానీ ఎప్పుడైతే లిన్ తన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని మారి పోయాయి అన్నట్లుగా పేర్కొన్నాడు.

నా జీవితంలో ఆమె రాక చాలా మార్పులను తీసుకు వచ్చింది. అంతే కాకుండా ఆమె వల్ల నా పర్సనల్ మరియు నా కెరీర్‌ పరంగా మార్పులు వచ్చాయి అంటూ రణదీప్‌ హుడా అన్నాడు. ఈ ప్రేమికుల దినోత్సవం మాకు చాలా స్పెషల్‌ అని, ముందు ముందు మా జీవితం చాలా సంతోషంగా ఉండాలంటూ లిన్ కి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Tags:    

Similar News