ఈ ముగ్గురులో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే ?
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ నిర్మాతగా కూడా మారి ఇప్పటి వరకు ఏడు సినిమాలు నిర్మించడం విశేషం.;

ప్రతి ఇండస్ట్రీలో సినీ లవర్స్ ఉంటారు. సినిమాని వాళ్లు ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించరు. సినిమా కోసం వాళ్లు చేసే హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో వాళ్లని చూస్తే ముచ్చటేస్తుంటుంది కూడా. తాము నమ్మిన ప్రాజెక్ట్ కోసం వాళ్లు ఎంత వరకైనా వెళతారు.. ఏం చేయడానికైనా వెనుకాడరు. అది మరెవరో కాదు టాలీవుడ్ హీరో నాని, తమిళ్ హీరో శివకార్తికేయన్, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. సినిమాలకు సంబంధించిన హార్డ్ వర్క్ విషయంలో వీళ్లతీరువేరు.
నేచురల్ స్టార్ నాని అసిస్టుంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత హీరోగా మారడం తెలిసిందే. కెరీర్ తొలి నాళ్ల నుంచి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ నాని ప్రత్యేకతను చాటుకున్నారు. నేచురల్ స్టార్‌గా పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ని దక్కించుకున్న నాని ఇప్పటికీ తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధని తీసుకుంటూ సక్సెస్‌లో ఓ భాగం అవుతున్నారు.
హీరోగానే కాకుండా నిర్మాతగానూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై వరుసగా అర్థవంతమైన సినిమాలు చేస్తూ సినిమాపై తపకున్న ప్యాషన్‌ని, ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా తనదైన హార్డ్ వర్క్‌తో సినిమాలంటే తనకున్న ఇష్టాన్ని, ప్రేమని ప్రదర్శిస్తున్నారు. టెలివిజన్ ప్రజెంటర్‌గా, యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శివకార్తికేయన్ తనదైన హార్డ్ వర్క్‌తో హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ నిర్మాతగా కూడా మారి ఇప్పటి వరకు ఏడు సినిమాలు నిర్మించడం విశేషం. రీసెంట్‌గా 'అమరన్' సినిమాతో డీసెంట్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న శివకార్తికేయన్ త్వరలో ఏ.ఆర్. మురుగదాస్ 'మదరాసి', సుధాకొంగర 'ప్రజాశక్తి' సినిమాలతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాల్లో 'ప్రజాశక్తి' వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని,శివకార్తికేయన్‌ల తరహాలోనే సినిమా అంటే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కుప్రత్యేక అభిమానం.
తను అంగీకరించిన సినిమా కోసం పృథ్వీరాజ్ చేసే హార్డ్ వర్క్ కో స్టార్స్‌నే ఆశర్చర్యానికి గురిచేస్తుంటుంది. ఇందుకు ప్రత్యేక ఉదాహరణే 'గోట్ లైఫ్'. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలని జోర్డాన్‌లో చిత్రీకరించారు. అదే సమయంలో కరోనా విళయం మొదలైంది. టీమ్ అంతా అక్కడే స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. అయినా సరే సినిమాపై ఉన్న ప్రేమతో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పృథ్వీరాజ్ 'గోట్ లైఫ్'ని పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. ఒకటి 'సలార్ 2' కాగా మరొకటి మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్. హీరోగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ దర్శకుడిగానూ తన ముద్రవేస్తున్నారు. మోహన్ లాల్‌తో ఆయన చేసిన 'ఎంపూరన్ 2' రీసెంట్‌గా విడుదలైంది.