సంక్రాంతికి సీక్వెల్ ఫిక్స్ చేసిన విక్ట‌రీ!

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌టేష్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Update: 2025-01-12 08:30 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇంత వ‌ర‌కూ అనీల్ సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది లేదు. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి సైతం భారీ వ‌సూళ్లు తెచ్చే సినిమా అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌టేష్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

సినిమా హిట్ అయితే గ‌నుక త‌మ కాంబినేష‌న్ లోనే సీక్వెల్ ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. అయితే ఇదే విష‌యా న్ని అనీల్ మ‌రోలా రివీల్ చేసారు. `ఎఫ్ -2` ప్రాంచైజీ- సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల‌ను ఓ యూనివ‌ర్శ్ లా తీసుకొస్తామ‌న్నారు. ఎఫ్ -2 ఆద్యంతం హిలేయస్ ఎంట‌ర్ టైన‌ర్. న‌వ్వులు పువ్వులు పూయించే ప్రాంచైజీ ఇది. `సంక్రాంతి కి వ‌స్తున్నాం` కూడా కామెడీ బ్యాక్ డ్రాప్ లో తీస్తూనే సీరియ‌స్ యాక్ష‌న్ చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు.

ఇప్పుడీ మూడు చిత్రాల్ని క‌ల‌పి ఓ యూనివ‌ర్శ్ కి క్రింద‌కు తీసుకొస్తేఅందులో పాత్ర‌లు కూడా యాడ్ అవుతాయి. `ఎఫ్ 2` లో వెంకీతో పాటు వ‌రుణ్ తేజ్ కూడా న‌టించాడు. సంక్రాంతి కాన్సెప్ట్ లోనూ వ‌రుణ్ యాడ్ అవుతాడు. అయితే అనీల్ యూనివ‌ర్శ్ నుంచి సినిమాలు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం రిలీజ్ త‌ర్వాత అనీల్ మ‌రికొంత మంది హీరోల‌తో సినిమాలు చేయాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవితోనూ ఓప్రాజెక్ట్ లాక్ అయిన‌ట్లు ప్ర‌చారం లో ఉంది.

త‌దుప‌రి ఈ సినిమా ప‌నుల్లోనే అనీల్ బిజీగా ఉంటాడు. ఆ త‌ర్వాత యూనివ‌ర్శ్ లో సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తాడు. ఇప్ప‌ట్లో తాను ఎలాగూ పాన్ ఇండియా సినిమాలు తీయ‌న‌ని తేల్చేసిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే ఇప్పుడున్న అనుభ‌వం స‌రిపోద‌ని అందుకే స‌మ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు.

Tags:    

Similar News