విగ్గు పెట్టుకోమ‌న్నార‌ని ఛాన్సులొదులుకున్న హీరో!

మ‌ల‌యాళం న‌టుడు ప‌హాద్ పాజ‌ల్ `పుష్ప` సినిమాతో తెలుగు నాట బాగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పేరుతో బాగా పాపుల‌ర్ అయ్యాడు.

Update: 2024-12-01 14:30 GMT

మ‌ల‌యాళం న‌టుడు ప‌హాద్ పాజ‌ల్ `పుష్ప` సినిమాతో తెలుగు నాట బాగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పేరుతో బాగా పాపుల‌ర్ అయ్యాడు. పార్టీ లేదా పుష్పా అంటూ నెట్టింట ఓ ఊపు ఊపేసిన న‌టుడు. అప్ప‌టి నుంచి ఆయ‌న న‌టించిన మ‌ల‌యాళ సినిమాలు తెలుగులో కూడా విడుద‌ల‌వుతున్నాయి. వైవిధ్య‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం ప‌హాద్ ప్ర‌త్యేక‌త‌. మ‌ల‌యాళంలో ప‌హాద్ ఫేమ‌స్ న‌టుడు. ఇత‌ర భాష‌ల్లో స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ మ‌రింత సంచ‌ల‌న‌మ‌వుతున్నాడు.

అయితే ప‌హాద్ కెరీర్ లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. హీరో అవకాశాలు వ‌చ్చినా? నేచుర‌ల్ గానే న‌టించాలి అన్న కార‌ణంతో వ‌చ్చిన అవ‌కాశాలు వ‌దులుకున్న సంఘ‌ట‌న గురించి చెప్పుకొచ్చాడు. `వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంచుకుని జాతీయ‌, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న న‌న్ను మొద‌ట్లో కొంద‌రు ద‌ర్శ‌కులు హీరోగా న‌న్ను బ‌ట్ట‌త‌ల‌తో చూపించ‌డానికి ఇష్ట‌ప‌డేదు. విగ్గు పెట్టుకుని న‌టించ‌మ‌న్నారు. అలా న‌టించ‌డం నాకు ఇష్టం లేదు.

దీంతో వ‌చ్చిన హీరో అవ‌కాశాలు వ‌దులుకున్నాను. అలా చాలాసార్లు జ‌రిగింది. నా సినిమాల్లో సూప‌ర్ డీల‌క్స్, ట్రాన్స్, సీయూ సూన్, జోజీ, మాలిక్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాను. వాటిలో నేను నిర్మించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ప్రేమ‌లు కూడా మా సంస్థ నుంచి రిలీజ్ అయిన చిత్ర‌మే` అన్నారు.

అలాగే పుష్ప‌-2లో త‌న పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసాడు. అల్లు అర్జున్ కి ధీటుగా త‌న పాత్ర‌ను సుకుమార్ మ‌లిచిన‌ట్లు తెలిపారు. ఈ సినిమా కోసం తెలుగు నుంచి డబ్బింగ్ చెప్పాన‌న్నారు. కానీ తెలుగు నేర్చుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌న్నారు. ఇంకా భ‌విష్య‌త్ లో మరికొన్ని తెలుగు సినిమాల్లో న‌టించాలి! అన్న ఆస‌క్తిన వ్య‌క్తం చేసారు.

Tags:    

Similar News